శ్రీ మహాశాస్తా చరితము - 58 | కవలలను హతమార్చిన శాస్తా | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 58 | కవలలను హతమార్చిన శాస్తా | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

కవలలను హతమార్చిన శాస్తా 

వింధ్య పర్వతమునకు దక్షిణ దిక్కున అమరియున్న విశ్వమంగళము అను రాజ్యమును
భీమనాధుడను రాజు పరిపాలించుచుండెను. ఇతడి భార్య పేరు సుదేహి. వీరిరువురూ అఖిలలోక పాలకుడైన శ్రీమహాశాస్తా పట్ల భక్తి కలవారై యుండిరి.

వేటయందు అమిత మక్కువగల భీమనాధుడు , ఒకనాడు వేట నిమిత్తమై తన రాజ్యపు పొలిమేరల యందున్న అడవికి వెళ్ళెను , వేటకై వెళ్ళిన మహారాజు ఎట్లో తన పరివారమును వదలి ,
దారి తెలియక వేరు చోటికి పోయెను. వేట యందు కలిగిన దప్పిక తీరు మార్గము దొరకక ,
అలసిపోయి సొమ్మసిల్లెను.

అటువైపుగా వచ్చిన అసురకన్యయైన రత్నప్రభ యనునది సొమ్మసొల్లి పడియున్న మహారాజుని
చూచి , అతడి అందచందములకు బానిస అయినది. అతడి వాలకము చూచి మహారాజుగా గుర్తించి ,
తనలో తాను ఇట్లు అనుకొనెను. *'అసురకన్య అయిన నన్ను ఈ మానవుడు మనువాడజాలడు. మాయోపాయము పన్ని , జరిగినదంతయూ మరచిపోవునట్లు చేసి , ఆ పై అతడిని పొందుదును”*
అనుకొనెను.

అప్పటికప్పుడు సకల సౌకర్యములు కలిగిన భవనమును నిర్మింపజేసి మహారాజును అచట
ఉంచెను. కళ్ళు తెరచి చూచిన మహారాజు , రాక్షస మాయవలన జరిగిన దంతయూ మరచినవాడై , తన ఎదుట నిలచిన యౌవనవతిని చూచి మొహించి పరిణయమాడెను.

ఇంతలోగా , మహారాజు జాడ తెలియక , భార్య అయిన సుదేహి ఎంతగానో వగచుచూ ,
బాధలను తీర్చు దైవమైన శ్రీ మహాశాస్తాతో తన గోడు విన్నవించుకొనెను. భక్తుల అభీష్టము నెరవేర్చు మహాశాస్తా ఆకాశవాణి రూపుగా *“భక్తురాలా ! నీ భర్త ఒక రాక్షసి మాయలో పడి జరిగిన దంతయూ మరచిన వాడయ్యెను. నా ఆలయమున 48 రోజుల పాటు విశేష అభిషేక , ఆరాధనలు చేసి , అన్నదానము చేసినచో నీ భర్త రక్కసి పిడికిలి నుండి తప్పించుకుని, నిన్ను చేరుకొనును”* అని
పలికెను. స్వామి చెప్పిన విధముగానే సుధేహి ఆలయమునందే ఉండి 48 రోజులు విశేష అభిషేక
ఆరాధనలు చేసి , అన్నదానము గావించినది. ఫలితముగా రాక్షస మాయలో మునిగి యున్న
మహారాజునకు వాస్తవము గోచరించినది. *“ఈ రాక్షస మాయలో పడి ఇన్ని దినములూ నన్ను నేను మరచినవాడనైతిని. నిజము తెలిసినచో ఆ రాక్షసి నన్ను వదలదు కదా. ఎట్లైనను తప్పించుకొనవలెను"*
అని ధృడముగా నిశ్చయించుకొని , స్వామిని చిత్తమున నిలుపుకుని , ధ్యానించుచూ ఆ అడవిని దాటి , తప్పించుకుని తన రాజ్యమునకు వచ్చి చేరెను. మహారాణియైన సుధేహి మిక్కిలి సంతసించి , తనకు
మరల జీవితమును ప్రసాదించిన శాస్తాను స్తుతించి , అతడి ఆశీర్వాదమును పొందెను.

రాక్షస కన్య అయిన రత్నప్రభ. , మహారాజు తన వద్ద నుండి తప్పించుకున్న సంగతి
తెల్సుకున్నదై మిక్కిలి దుఃఖించినది. ఆ సమయమున ఆమె గర్భవతియై యుండుటచే , సమయమునకై వేచి యెండెను. కొంత కాలమునకు ఆమెకు హంసకేతు , విజయకేతు అను కవలల కలిగిరి. వారిని వీరులుగా , ధీరులుగా తీర్చిదిద్దెను.

సుధేహియూ ఒక మగబిడ్డను ప్రసవించెను. తల్లిదండ్రులు ఆ బాలునకు *'సుశాంతుడు'* అను
నామమునిడిరి. యుక్తవయస్సు రాగానే మద్రదేశపు రాకుమార్తె అయిన *'కాంతిమతి'* యను కన్యతో
వివామము గావించిరి. భీమనాధుని అనంతరము, సుశాంతుడు రాజ్యభారము బూని , పట్టాభిషిక్తుడై
మహాశాస్తాని సేవించుకుంటూ , సుఖశాంతులతో రాజ్యపాలన చేయసాగెను.

ఇదే సమయమున రత్నప్రభ సోదరుడైన *'మధుక్రీటుడు'* అనువాడు సుశాంతుని రాజ్యమున నున్న ప్రజలను బాధింపసాగెను. ప్రజలు మహారాజుని ప్రార్థించగా , తన సేనలతో వెడలి మధుక్రీటునితో యుద్ధము చేసి వాడిని అంతముగావించెను. ఈ సంగతి విన్న హంసకేతు ,
విజయకేతువులు కోపము బూనిరి. తల్లియైన రత్నప్రభ వారితో *“బిడ్డలారా ! మహారాజు సుశాంతుడు పేరు ఎవరో కాదు. మీకు తోబుట్టువే. మీ మేనమామ చేసిన ఘోరకృత్యములకుగాను , కర్తవ్యరక్షణకై చంపవలసి వచ్చినది. కాబట్టి మీరు అతడిపై కినుకబూనవలదు”* అని వారించి , సమాధాన పరచినది.

తల్లి చెప్పిన సంగతి విన్న సోదరులు ఆశ్చర్యము చెంది , *“అయినచో తండ్రిగారి మొదటి సంతానము మేమే గావున , రాజ్యపాలన చేయు హక్కు కూడా మాకే కలదు. సుశాంతునితో యుద్ధము చేసి అతడిని చెరపట్టి , రాజ్యమును చేబట్టుదుము”* అని ప్రతిన బూనిరి. తల్లి ఎంత
వారించిననూ పెడచెవిని పెట్టి , సేనను సమకూర్చుకుని , విశ్వమంగళ దేశముపై దండెత్తి వెళ్ళిరి.

సుశాంతుడు ధర్మనిరతుడై ఓపికగా , వారిని సహించుచూ , మరొక పక్క పరాక్రమవంతుడై
వారితో యుద్ధము చేయసాగెను. రాక్షస సేన ముందు అతడి బలపరాక్రమములు నిలువజాలక , ఓడిపోయెను. సుశాంతుడు అతడి భార్య చెరసాలయందు బంధింపబడియుండిరి. విజయులైన
అసురపుత్రులు సింహాసనమున అమరి , దుష్టపరిపాలన చేయసాగిరి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow