శ్రీ మహా శాస్తా చరితము - 61 | ఉగ్రనందనుని సంహారము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహా శాస్తా చరితము - 61 | ఉగ్రనందనుని సంహారము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

ఉగ్రనందనుని సంహారము

ఆకశమునంటు విధముగా , ఉన్నతముగా ఎత్తుగా అమరియుండు పర్వతములలో ఒకటి నీల పర్వతము. ఇంద్రుని యొక్క నాట్యకతైలలో ఒకరై అయిన తిలోత్తమ , ఒకనాడు నీల పర్వతము
మీదుగా పయనించుచుండగా , ఆ పర్వతరాజైన నీలపర్వతుడు ఆమెని చూచి , ఆమె అందమునకు మోహితుడాయెను.

ఆమెతో ఇట్లనెను *“ఓ అందాల రాశీ ! నేను నీల పర్వతుడను పర్వతరాజును. అప్పరసలలో ఒకరైన నిన్ను చూచి మోహించి నీకు బానిసనైతిని. నా ఆహ్వానమును అంగీకరించి కొంత కాలము నాతో గడుపుము”* అని అభ్యర్థించెను.

కడు దీనముగా ప్రార్థించిన పర్వతరాజు యొక్క కోరికను మన్నించిన తిలోత్తమ , తానునూ
అతడిపట్ల వ్యామోహితురాలై అతడితో ఉల్లాసముగా సంచరించసాగెను. శాస్త్ర విరుద్ధమైన సంధ్యా
సమయమున ఇరువురూ సంభోగించిన కారణముగా , రాక్షస గుణములు కలిగిన *'ఉగ్రనందనుడు'*
అను పుత్రుడు జన్మించెను.

భీకర స్వరూపముతో సంచరించు అతడు చూచుటకే జుగుప్స కలిగించు విధముగా నుండెను. పదవీ వ్యామోహము కలిగి యుండెను. ముల్లోకములనూ తానే ఏకఛత్రాది పత్యము చేయవలెనను సంకల్పము కలిగెను. బ్రహ్మదేవుని గూర్చి తపమొనరించి , అతడి అనుగ్రహము చేత అతడు కోరిన విధముగానే అధిపతి కాగలిగెను. వరమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడు కూడా తప్పించుకోలేక
పోయెను. రాక్షస పరిపాలన జరుగుచుండుటచే ముల్లోకములయందు వేదనాభరిత పరిస్థితి
నెలకొనియుండెను.

సదాలోక కల్యాణమునకై నడుము కట్టుకొను నారదమహాముని ఇదంతయూ చూచి వేదన
చెందెను. అందరి యొక్క బాధలను తీర్చువాడునూ , సర్వమంగళదాయకుడునైన హరిసుతుడు
మాత్రమే ఈ బాధలను తొలగించువాడు. ముల్లోకములనూ తనకు లోబడియుండునట్లు పరిపాలించు
ఆ స్వామి. దైత్యుడు తపఃప్రభావము వలనే కదా ఇంతటి సామర్థ్యము పొంది యున్నాడని దైత్యుని యొక్క తపస్సునకు గల విలువ చేతనే కదా ఉపేక్షించుచున్నాడు. ఇరువురకీ వైరము కలుగచేసినచో , లోకమునకు కలిగిన పీడ తొలగిపోవును కదా యని ఆలోచించెను.

తన కలహమును ముందుగా ఉగ్రనందనునితో ప్రారంభించెను. ఒకనాడు అతడి సభకు
అరుదెంచగా , ఉచితమర్యాదలు గావించిన రాక్షసునితో *“రాక్షస కుల దీపికా ! ముల్లోకములను జయించిన నీవు , శాస్త్రుతలోకమును చేరలేకపోతివి కదా ! ఇంద్రాది దేవతలు నిన్ను కొలుచునట్లుగా , మహావీరుడు , మహాకాలుడు వంటివారు నిన్ను కొలిచి మర్యాద చేయుట లేదు కదా”* అని
పుల్లవైచెను. అంతవరకూ ఆసంగతినే గమనించని ఉగ్రనందనుడు *“ముని వర్యా ! నీవు చెప్పినది నిజము. ఇప్పుడే నేను నాదూతలను పంపి , వారిని నా వద్దకు వచ్చి నమస్కరించి పొమ్మని ఆజ్ఞాపింతును”* అనెను.

తన కలహము ప్రారంభమైనదన్న సంతోషముతో , నారదముని అతడి వద్ద నుండి సెలవు దీసికొని వెడలిపోయెను. ఉగ్రనందనుడు తన కుమారుడైన బాలనందనుని శాస్తులోకమునకు పంపి , మహావీరాదులను తన వద్దకు వచ్చి , తనకు నమస్కరించి పొమ్మని చెప్పి పంపెను. కానీ వారు నిరాకరించిగా , ఉగ్రుడైన దైత్యరాజు అది తనకు కలిగిన ఘోరపరాభవముగా ఎంచెను. వెంటనే తన సేనానాయకులను ఐదుగురిని పిలిచి , శాస్తులోకమునకు పోయి మహావీరాదులను చెరబట్టి
తీసుకురమ్మని "ఆజ్ఞాపించెను.

ఈ సంగతి నంతయూ ముందుగానే ఊహించిన స్వామి , ఒక బ్రాహ్మణ బాలుని వేషము
ధరించి , ఉక్రోషముగా ముందుకు దూకుచున్న అసుర సైనికుల ముందునిలచి , *అసురులారా ! ఎందుకొరకు , మీరు ఇంత ఆవేశముగా ఉరుకుచున్నారు”* అని ప్రశ్నించెను. శాస్తులోకమున నున్న గణనాధులను చెరబట్టు నిమిత్తమైపోవు మమ్ములను ప్రశ్నించు బాలుడవు నీవు ఎవరు ? అని తిరిగి ప్రశ్నించిరి.

పుట్టినది భూలోకమునందైననూ , పుణ్యవశమున సామీప్యముక్తిని పొంది , మహాశాస్తాయొక్క
లోకమున వసించు భాగ్యమును పొందిన వాడను. ఆలోకపు మహావీరులను ఎదిరించు శక్తి మీకు కలదా “అని ఎదురు ప్రశ్నవేసెను. బదులుగా వారు *“ముల్లోకములను సైతము తనకు లోబడి యుండునట్లు చేసిన శక్తి మంతుడైన ఉగ్రనందనుని అగ్ని జ్వాలలకు వారు ఆహుతి అవక మానరు కదా”* అని గర్వముగా పలికిరి

ఇది విసిన , బాలుని వేషమున నున్న భగవంతుడు , తన నోటిని తెరువగా , నోటి నుండి వెలువడిన అగ్నిజ్వాలలు క్షణమాత్రమున వారిని మాడ్చి మసి చేసినవి.

ఇది విన్న ఉగ్ర నందనుడు కోపావేశము బూని , తన యొక్క అసుర సేనతో తరలిరాగా , బాలుని
వేషమున నున్న శాస్తా స్వయరూపము బూని మదపుటేనుగుని అధిరోహించిన వాడై అతడి ముందు నిలచెను. అతడిని చూచినంతనే ఉగ్రనందనుడు. నీ యొక్క మాయోపాయము చేత నా సైన్యాధిపతులను
సంహరించినావు. నాయొక్క పరాక్రమమును ఇకనైనా తెలిసి కొనుము “అనుచూ శక్తి వంతమైన
అస్త్రములను స్వామిపై సంధించసాగెను.

అతడు వేసిన అస్త్రములన్నియూ , స్వామిని చేరకమునుపే మందార పూవులుగా మారి , మాలగా
అతడి కంఠమును అలంకరింపబడెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow