శ్రీ మహాశాస్తా చరితము - 65 | చెడు ప్రవర్తన కలిగిన స్త్రీని ఆశీర్వదించిన విధము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 65 | చెడు ప్రవర్తన కలిగిన స్త్రీని ఆశీర్వదించిన విధము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

చెడు ప్రవర్తన కలిగిన స్త్రీని ఆశీర్వదించిన విధము

 ఒకప్పుడు *' గోమేధకం'* అను ద్వీపమునందు పుండరీకుడను విష్ణుభక్తుడు నివసించుచుండెను.
పరమభాగవతోముడైన అతడు ఆపారమైన శాస్త్రసంపదతోనూ , ఐశ్వర్యసంపదతోనూ ఉన్నతముగా
జీవించుచుండెను. కానీ అతడు పూర్వజన్మలో చేసిన పాపము కారణముగా చిత్రలేఖయను అశ్లీలవతిని భార్యగా కలిగియుండెను. తనంతటి సౌందర్యవతి లేదను గర్వముతో , సిగ్గు , బిడియము
అనునవిలేనిదై తన ఇష్టానుసారము కోరినవారితో కామవాంఛలు తీర్చుకొనసాగినది.

తన భర్త వద్దనుండు శిష్యులు , బంధువులు , భక్తులు ఇట్లు పలువురితో సంపర్కము కలదై
యుండెను. దీనితో పలువురు తమ తపస్సులను భగ్నము చేసుకొనియూ , శీలమును పోగొట్టుకొనియూ ,
తమ అసువులను బాసినవారైరి. శీలవంతురుగా బ్రతుకులేక ఆత్మహత్యలు చేసుకొనిరి. అది చూచి కూడా ఆమె ప్రవర్తన మారలేదు. మొదట్లో ఈ విషయము భర్తకు తెలియకపోయిననూ , కాలము గడిచిన కొద్దీ భార్యయొక్క ప్రవర్తన తెలిసి సిగ్గుపడెను. కానీ ఆమెను ఖండించు శక్తిలేక , ఆమె సౌందర్యమునకు దాసుడై తెలిసీ తెలియనట్లు ఊరకుండెను.

ఇట్లుండగా , ఒకనాడు తపస్సంపనన్నుడు , ఈశ్వరునికి సమమైనవాడు కోపిష్టి అయిన దుర్వాసమహాముని అచటికి ఏతెంచెను. శిష్యగణముతో ఏతెంచిన మునీశ్వరునికి తన శిష్యగణములతో
పోయి అతిధి సత్కారములు గావించెను. తన భార్యను పిలిచి , మునీశ్వరునకు భిక్షవేయుమని ఆదేశించి వెడలిపోయెను. చిత్రలేఖ వచ్చి భిక్ష వేయుటకు ముందుగానే మరొకరి వద్దనుండి భిక్ష గైకొనెను. అందుచేత భిక్ష వలదని చిత్రలేఖను పంపివైచెను. కానీ మునీశ్వరుని యొక్క తేజస్సును చూచిన ఆమెకు కామోద్రేకము కలిగినదయ్యెను. మరుగున దాగియుండి , అతడు నిద్రించిన పిమ్మట
అతడిని చేరి మోహావేశముతో అతడిని పెనవేసుకొనెను. హఠాత్తుగా జరిగిన ఈ సంభవమునకు దిగ్గున లేచిన ముని శ్రేష్ఠుడు ఆమెను తేరిపార చూడగా , అతడి దృష్టి తీవ్రముగా నుండుటచే
భయపడి పారిపోయి , ఒక చెట్టుకింద నున్న మేకల మంద యందు దాక్కొనెను.

తన జ్ఞాన దృష్టి ద్వారా ఇదంతయూ చూచిన దుర్వాసుడు , ఏ చెట్టుకింద ఆమె దాక్కున్నదో , చెట్టు పైనెక్కి అచటనే వేలాడునట్లు శాపమిచ్చెను. ఆమె ఎంత ప్రయత్నించిననూ చెట్టు దిగి కిందకు రాలేనట్లు కట్టడి చేసెను. అంతకు మునుపే ఆమె యొక్క చెడు ప్రవర్తనకు విసిగియున్న ఊరి ప్రజలు
ఆమె చుట్టూ చేరి హేళన చేయసాగిరి. ఆమెకు తగిన దండన విధించబడినదని ఆనందించిరి.
సంగతి తెలుసునని పరుగున వచ్చిన పుండరీకుడు , భిక్షవేయుటకై వచ్చిన తన భార్యను ఇట్లు శపించుట సరియేనాయని ప్రశ్నించెను. ఆమెను చెట్టు నుండి నేలమీదకు దిగివచ్చునట్లు చేయుమని వేడుకొనెను.

ఇది విన్న దుర్వాసుడు మిక్కిలి కోపము బూనినవాడై *“చెడునడత కలిగిన ఆమె నీ భార్యయా ? నీవు కోరినట్లుగానే ఆమెను శాపవిముక్తురాలను చేయుదును. కానీ ఒక షరతు. ఈ పాతకితో పాటు సుఖించినవారు , ఈమెను పేరు పెట్టి పిలిచినచో , ఈమె కిందికి దిగి రాగలదుసుమా”* అనెను.

తన భార్య యొక్క ప్రవర్తన బాహాటముగా అందరికీ తెలిసిపోవునేయని పుండరీకుడు తనలో
తానే కుళ్ళిపోయెను. అయిననూ చేయునది లేక , సమ్మతించెను. అతడి శిష్యులలో కొందరు ఆమెను పిలువగా , సగం చెట్టు వరకూ మాత్రమే దిగగలిగెను. ఇక చేయునది లేక తనకు తెలిసిన పేర్లను
తానే చెప్పగా పూర్తిగా దిగగలిగెను. ఇంకనూ కొన్ని పేర్లను తానే మరచిపోయితినని చెప్పుటతో దుర్వాసుని కోపము అంబరమంటెను.

పుండరీకునివైపు తిరిగి , *“చెడుప్రవర్తన కలిగి సంచరించు భార్యను కట్టుదిట్టము చేయలేని భర్త , తల్లివంటిదైన గురుపత్నితో సంపర్కము పెట్టుకొనిన అతడి శిష్యులు , ఈ పాతకి యొక్క పాపములో భాగస్థులగుదురుగాక”* అని శపించెను.

ఆమె వైపు తిరిగి *“ఒసే పాతకీ ! నీ యొక్క పాపం కిలమైన చేష్టులకు గానూ , అసుర కులమునందు బ్రహ్మరాక్షసిగా జన్మింతువుగాక. నన్ను చూచి భయపడి ఏ మేకల యందు దాక్కుంటివో , అట్టి మేక తలను ధరించి యుందువు గాక”* అని శపించెను.

చెట్టు దిగి వచ్చిన ఆమె తన ప్రవర్తనకు సిగ్గు చెందినదై , మునీంద్రుని ముందు మోకలిల్లినది.

*“ఓ వనితా ! అసహ్యకరమైన నీ ప్రవర్తన ఫలితమే ఈ శాపము. ఫలితముగా అసుర కులమున మాయ అను రాక్షసికి , అజముఖి అను నామధేయము పొంది జన్మింతువు గాక.”* అని శపించెను.

అప్పటికి తాను చేసిన తప్పును తెలిసికొన్న చిత్రలేఖ , మునీశ్వరుని పాదములపై బడి
శాపవిమోచన కలుగచేయమని ప్రార్థించినది. తన తప్పును గ్రహించిన ఆమె యందు కరుణ
కలిగినవాడైన దుర్వాసుడు.

పరమ దయాలుడైన మహాశాస్తా మాత్రమే శాపవిమోచన చేయదగినవాడు కాబట్టి అతడిని ప్రార్థించుమని సలహా ఇచ్చెను.

*"శాపము ప్రకారము నీవు అజముఖి నామధేయము పొంది , దుర్గుణములు కలిగి జీవింతువు. కొంతకాలమునకు శాస్తాని శరణుగోరి అభయము పొందిన ఇంద్రాణిని , బలాత్కారముగా ఈడ్చుకుని పోవునపుడు శాస్తా యొక్క గణాధిపతియైన వీరమహాకాలుడు.*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow