స్వామి చేత అనుగ్రహింపబడిన నాయన్మారు
కావేరీనదీ తీరమున గల కుగ్రామము *'కంజారూరు'* తరతరాలుగా మహారాజునకు సేనాధిపత్యము
వహించు కులమున *'మానకాంతుడు'* అనువ్యక్తి ఉండెను. అతడి భార్య పేరు కల్యాణసుందరి. ఆమె
గుణవతి. వారిరువురూ లోకపాలకుడైన ఈశ్వరుని యందునూ , వారి ఊరియందుగల రావిచెట్టు
కింద వెలసి యున్న రాజశాస్తాయందునూ అమితమైన భక్తి కలిగియుండిరి. మానవ సేవయే మాధవసేవ అనునట్లుగా , ఎవరేది అడిగిననూ లేదనక ఇచ్చుచుండు దాతృస్వభావము కలవాడు , అతడి ఆజ్ఞకై ఎదురుచూచు సైనికులు , కనుసైగ చేసినంత మాత్రముననే ఇచ్చిన కార్యము నెరవేర్చగల పనిమనుషుల , హోదా కలిగియున్ననూ , అందరి ముందు చేతులు కట్టుకుని మర్యాద పూర్వకముగా వినయవిధేయతలు కలిగి యుండెడివాడు. వారికి ఉన్న కొరతల్లా సంతతి లేకపోవుడయే.
భగవంతుని కృప వలన అతిత్వరలోనే కల్యాణసుందరి ఒక ఆడపిల్లను ప్రసవించినది. తమ కులమునకే పేరు ప్రఖ్యాతులు కలుగజేయునున్న ఆలోచనతో ఆ బిడ్డకు పుణ్యవర్ధిని అను పేరు
పెట్టుకొనెను. దైవప్రీతి కలదై , సదా దైవమును మనస్సు నందు నిలుపుకున్నదైన పుణ్యవర్థినికి యుక్త
వయస్సు వచ్చినది.
ఐశ్వర్యవతియై , దైవభక్తికలదై , యుక్తవయస్సుననున్న ఆమెను చూచి పలువురు ఆమెను కోడలిగా పొందుటకు ఉత్సాహము చూపుచుండిరి. మానకాంతుని కులస్థుడైన *'కలిక్కాముడు'* అను యువకునితో పెండ్లి నిశ్చయమైనది. కంజారూరు గ్రామము కల్యాణ శోభను సంతరించుకున్నది.
వివాహ ప్రయత్నములు కోలాహలముగా కొనసాగుచున్నవి. పెండ్లి కుమారుడైన *'కలిక్కాముడు'*
పెండ్లి కొడుకుగా అలకరింపబడి , మంగళవాద్యములు మ్రోగుచుండగా కంజారూరుకు ఊరేగింపుగా
వచ్చుచుండెను.
ఈ సమయమున , భక్తుడైన మానకాంతునితో లీలావినోదము గావించి , తద్వారా అతడి కీర్తి
లోకులకు తెలియజేయవలెనను సత్సంకల్పము పూనిన వాడైన పరమశివుడు శివయోగి వేషము
ధరించి అచట ప్రత్యక్షమయ్యెను. నుదుట విభూదిరేఖలు , తలకు వెనుక భాగమున పిలక ,
చెవులయందు ముత్యపు కుండలములు , తలవెంట్రుకలతో చేయబడిన ఉపవీతము చేతిలో విభూతి
పాత్ర , పంచముద్రలు ధరించిన శివభక్తుడని చూచిన వెంటనే అందరికీ అర్థమగు రీతిలో నుండెను.
అతడిని చూచినంతనే , మానకాంతుడు (శివభక్తుడు కావున) తన కుమార్తె వివాహ సమయమున
భువికి సాక్షాత్తూ పరమశివుడే శివయోగి వేషము బూని వచ్చియుండునన్న సంతోషముతో, అతడి
కాళ్ళ పై బడి ఆశీర్వదింప
గోరెను. తన కుమార్తె అయిన పుణ్యవర్ధినితో కూడా , స్వామికి నమస్కరించి
ఆశీర్వాదములను అందుకొనుమని చెప్పెను. ఆమె కూడా తండ్రి చెప్పినట్లే నమస్కారములు చేసినది.
ఆమె వంగి నమస్కారము చేయు సమయమున , తటాలున ఆమె యొక్క దీర్ఘమైన కురులను
ఒడిసిపట్టుకుని *“దీనిని నేను పంచవటిగా ఉపయోగించుకొందును. నాకు ఇమ్మని”* అడిగెను.
(పంచవటి యనగా తల వెంట్రుకులచేత చేయబడు ఉపవీతము) అడిగినదే తడవుగా , ఏ మాత్రమూ
ఆలోచన కలుగనివాడై , కొద్ది సేపటిలో ఆమెకు వివాహము జరుగనున్నదేయని కూడా ఆలోచింపక , శివుని ఆజ్ఞగానే భావించి , తన కరవాలము దూసి , తన కుమార్తె యొక్క దీర్ఘమైన కురులను కత్తిరించి , శివయోగికి కానుకగా ఇచ్చెను.
అది అందుకొన్ని శివయోగి , మరుక్షణమే వృషభరూఢునిగా సాక్షత్కరించి , *“నీకు నా పై గల శివభక్తి ఎంతటిదో లోకులకు తెలియజేయుటకై ఇట్లు నాటకమాడితిని. ఇదేవిధముగా జీవితాంతమూ శివభక్తిని కలిగి , అంతమున సదా నన్ను స్తుతించు భాగ్యమును పొందుదువుగాక”* అని ఆశీర్వదించెను.
(ఇతడే తరువాతి కాలమున మాన కంజార్ ' నాయన్మారునిగా అరువది మూడు నాయన్మారులలో
ఒకనిగా ప్రసిద్ధి పొందినవాడు)
అంతలో పెండ్లికుమారునిగా అచటికి వచ్చి చేరిన *'కలిక్కాముడు'* జరకిగినదంతయూ విన్న
తరువాత ఆ సమయమున నేను లేకపోతిని కదా అని తన్ను తాను నిందించుకొనెను. కానీ
వివాహము జరుగటలో కొంత ఆలస్యము జరిగినది. తలవెంట్రుకలను కత్తిరించి యుండటచే శాస్త్రవిరోధమైన సంగతిగా ఆమె పెండ్లిపీటలపై కూర్చొనలేక పోయినది. పురుషలకే ఇది సంప్రదాయ విరుద్ధము. అందునా ఆమె ఒక
కదా ! శిరోముండనము చేసుకొనియున్న
వివాహమునకు అర్హురాలు కాదు కదా” అన్నది ప్రశ్న.
అక్కడున్న ఎవరికినీ ఏమి చేయుటకూ పాలుపోలేదు. మానకాంతుని భార్య అయిన కళ్యాణసుందరి ,
ఆనంద తాండపురమందు పరిపాలన చేయుచున్న శివపుత్రుడైన మహాశాస్తాని ప్రార్థించెను.
*“అనుదినమూ మేము నిన్ను పూజించువారము కదా ! ఇంతవరకూ మా పట్ల అనుగ్రహముగానే ప్రవర్తించు నీవు , నీ ఆశీర్వాదము వల్ల మాకు కలిగిన మా కుమార్తె జీవితము నాశనము కాకుండా కాపాడుము"* అని కన్నీరు మున్నీరుగా ప్రార్థించినది.
తన తండ్రియైన పరమశివుని పూజించు కులస్థులైన మానకాంతునిపై కరుణబూనిన స్వామి
*“భక్తులారా ! బాధపడకుము. మీ కుమార్తె యొక్క కురులు మునుపటివలెనే మారిపోవును”* అని చెప్పి
అంతర్థానమయ్యెను.
వెనువెంటనే పుణ్యవర్థిని , మునుపటివలెనే దీర్ఘమైన కురులు కలదై నిలచియుండెను.
స్వామి యొక్క అనుగ్రహము వలన , వివాహము ఘనముగా జరిగినది. వచ్చిన వారందరూ ఈశ్వరుని యొక్కయూ , శాస్తా యొక్కయూ గొప్పతనమును పొగడుచుండిరి.