శ్రీ మహాశాస్తా చరితము - 78 | భార్గవరాముడు శాస్తాను ఉపాసించుట | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 78 | భార్గవరాముడు శాస్తాను ఉపాసించుట | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

భార్గవరాముడు శాస్తాను ఉపాసించుట

*జమదగ్ని మహర్షి , రేణుకాదేవి దంపతులకు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అంశంతో జన్మించిన
కుమారుడే పరశురాముడు. బ్రాహ్మణుడిగా జన్మించి , మునికుమారుడిగా పెరిగిన అతడు , తన
తండ్రిని హతమొనర్చిన కార్తవీర్యార్జునుడి వంశమును సర్వనాశనము గావింపవలెనని ప్రతినబూనెను. శ్రీకైలాసమును చేరి ఈశ్వరుడికి గూర్చి ఘోరతపమును గావించెను. అతడి తపోనిష్ఠకు మెచ్చి ,
శివుడు ప్రత్యక్షమై *"పరశురామా ! అద్భుత మహిమాన్వితుడైన , చైతన్య స్వరూపులైన శ్రీశాస్తా "శ్రీ భూతనాథాయ పరస్మై పరబ్రహ్మణే నమః” అని స్తుతింపబడుచున్నాడు” అను లక్ష్యము నెరవేరవలయుననిన , ఆది మూలమై వెలయునట్టి , నీ ఆవేశావతారనికి మూలరూపమైన శాస్తాను ఆరాధించుదువుగాక'* అని హితోపదేశము నొనరించెను.

శాస్తా యొక్క దయానుగ్రహమునకు పాత్రుడైన కార్తవీర్యుడిని వధింపవలెనని కోరెను. పరశురాముడు శాస్తాను గూర్చి తీవ్రతపస్సును గావించెను. స్వామి అతడి తపస్సునకు ప్రసన్నుడై పుత్యక్షమయ్యెను.

పరశురాముడి చేతనొక పరశువును ఇచ్చి , ఆశీర్వదించిన శాస్తా యుద్ధసమయము అవసరమైన ఉగ్రమును కూడా ప్రసాదించెను. ఆ వరప్రసాదమువలన పరశురాముడు కార్త వీర్యార్జునుడి
వంశావళినెల్ల సమూలముగా నిర్మూలనము గావింపదొడగెను. అంతటితో సంతృప్తి నొందక , అధర్మపరులై , అవినీతి మార్గమునందు సంచరించు క్షత్రియవంశరాజుల మీద ద్వేషభావమును పెంపొందించుకొని , 21 సార్లు దండయాత్ర చేసి , వారిని సర్వనాశనమొనరించి, విస్తారమైన
భూభాగమును జయించెను.

అటుపిమ్మట , శాంతించిన పరశురాముడు ప్రాణులను వధించునట్టి క్రూర కృత్యమును మాని ,
తపస్సు నాచరించుటకు సిద్ధపడెను. తపోజీవనమును గడుపనెంచి , అందుకొరకై ధర్మములోనూ
తపోబలములోనూ ఉన్నతమైనట్టి ఒక స్థలమును తనకు తానుగా సృష్టించికొనవలయునని యెంచెను.

తాను జయించిన భూభాగమునకు సరిహద్దుగా అమరిన పశ్చిమ పర్వత శ్రేణిని చేరుకొనెను. అచ్చటి నుండి సహ్యాద్రి అను పేరుగల పర్వత శిఖరాగ్రమును సమీపించెను. పర్వతము నానుకొని యున్నట్లుగా మహా సాగరము అమరియుండెను. పరశురాముడు సముద్రరాజును పిలిచి , *“ఈ పర్వతము నంటుకొని యున్న నీవు కొంతదూరమునకేగి , నాకు కావలసిన భూభాగమును ఇమ్ము”*
అని కోరెను.

సాక్షాత్తూ ఆ పరంధాముడి అవతారముగా జన్మించిన పరశురాముడి పలుకులను గౌరవించి ,
తక్షణమే సాగర రాజేంద్రుడు అతడి యెదుట సాక్షాత్కరించెను. భగవత్స్వరూపుడైన పరశురాముడికి
తనంతట తానే ఇంతింతయని భూమిని కొలిచి యివ్వడమనునది సమంజసముకాదు , కనుక , పరశురాముడితో ఇట్లనెను , *“భగవానుడా ! దైవికమగుమీ పరుశువును నాపై విసరివేయుడు. దాని మహిమ వలన సాగర జలమునెంత దూరము తొలగిపోవునో , అంత దూరము నేను వెనుకకు మరలి వెళ్లుదును , మీరు కోరినట్లుగా భూభాగమును స్వీకరింపుడు”* అని పలికెను.

సముద్రరాజు కోరిన విధముగా పరశురాముడు తన ఆయుధమైన పరుశువును బహు దూరముగా పడునట్లుగా విసరెను. ఎన్నో యోజనముల దూరము సముద్రజలములు చెల్లా చెదరైనవి. గోకర్ణము
మొదలుకొని కన్యాకుమారి వరకు సాగరము వెనుకకు జరిగి పోగా బహు విస్తారమైన భూభాగము
గోచరించెను. పరశురాముడి వలన ఏర్పడినందువసన భూభాగమునకు *"పరశురామక్షేత్రము”* అను పేరు కలిగెను. (కొబ్బరి నారికేళవృక్షములు చెట్లు) అధికముగా గానవచ్చుట వలన దానికి
కౌరవదేశముగా పిలువబడెను.

భూభాగమును తనకని ప్రత్యేకముగా సృష్టించుకొన్న పరశురాముడు , ధర్మరక్షకుడైన , విశ్వవ్యాపకుడైన శాస్తాను తన తపోమహిమ వలన నేర్పడిన తన దేశములో నెలకొనజేయవలయునని
తలచెను. అచ్చటనే సహ్య పర్వతమున నుండి మహాశాస్తాను గూర్చి తీవ్ర తపమునాచరించెను.
మునీశ్వరుడి యెదుట తారకమూర్తి ప్రత్యక్షమయ్యెను.

*"స్వామీ ! నేను ఏర్పరచుకొన్న ఈ భూభాగములో మీరు అవతరించి , ఈ భూమిని సంరక్షింపవలయును”* అని వేడుకొనెను.

*రక్షిత్వమ్ కేరళమ్ రాజ్యమ్ భార్గవేన మహాత్మనః |*
*ప్రార్థితోహమ్ వసిష్యామి తదార్థమ్ కేరళే త్వరూఢం||*

అతడి కోరికను నెరవేర్చుటకంగీకరించిన శాస్తా *"భార్గవ రామా ! నీ భూభాగములో నాకు పలు ప్రాంతములలో ఆలయములు నిర్మించబడునుగాక ! వాటిలో నెలకొనియుండి నేను ధర్మపరిపాలనమును సాగించుచుందును గాక ! "* అని అనుగ్రహించెను. తదనుగుణముగా పరశురాముడు అనేక ప్రదేశములలో ,
అనేక రూపాలలో స్వామి ఆలయములను నిర్మించెను.

కేరళదేశమును 64 భాగములుగా చేసి , బ్రాహ్మణులను అచ్చట నివాస మేర్పరచుకొనునట్లుగా
చేసెను. *'పూరు'* అను మహర్షి తపస్సు చేసిన స్థలములో పెరువనమునకు తూర్పున కుదిరాగ్ చివర , పటమట ఇడత్తురుర్తిలోనూ , ఉత్తరమున అగమలైలోను , దక్షిణమున ఊళములోను శాస్తాకు ఆలయములు కట్టించెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow