శ్రీ మహాశాస్తా చరితము - 79 | చోరుడిగా ఉండి మునిగామారిన మంత్రధ్రువుడు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 79 | చోరుడిగా ఉండి మునిగామారిన మంత్రధ్రువుడు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

చోరుడిగా ఉండి మునిగామారిన మంత్రధ్రువుడు

*దివిజులూ ద్విజులూ స్తుతించు హిమాలయ పర్వత ప్రాంతములో పూర్వము వేదపురి అను భూభాగముండెను. ఆ ఊరిలో దేవనారాయణుడను బ్రాహ్మణ కులజుడు వసించుచుండెను. అతడికి
జయంతుడను ఒక కుమారుడు ఉండెను. దురదృష్టవశమున , ఆ బాలుడు జన్మించిన కొలది
దినములలోనే తల్లిదండ్రులిరువురూ దివంగతులైరి. అందువలన జయంతుడి ఆలనాపాలనా బంధువులే
చూచుకొనుచుండిరి. తగిన తరుణమును చూచి జయంతుడికి మాలతి అను కన్యకామణితో వివాహము గావించిరి. అంతవరకు తాము కాపాడుచున్న పూర్వీకుల ఆస్తిపాస్తులను జయంతుడికి
అప్పగించిరి.

సద్గుణ సంపత్తి , భక్తి సంపద , విద్యాసంపద , ఇవేవియూ జయంతుడి దరి చేరలేదు. సరికదా ,
దురభ్యాసములన్నియు అలవడినవి. వాటికి బానిసయై తనకు సంక్రమించిన సర్వ సంపదలను
దూరముచేసికొని , దరిద్రుడయ్యెను , చివరికి భార్యను వెంటనిడుకొని , కానలకేగి తలదాచుకొనెను. ఆ
మార్గములో పయనించుచున్న వణిజులను , ధనవంతులను అడ్డగించి , బెదరించి వారి విలువైన వస్తువులను అహహరించి జీవనమును కొనసాగించుచుండెను.

ఒక పర్యాయము , అడవి దారిలో శ్రీమంతులైన దంపతులిద్దరు ప్రయాణము చేయుచుండిరి. జయంతుడు ఒక పదునైన ఆయుధముతో వారి నడ్డగించి భయ పెట్టి , వారి వస్తువులను దోచుకొన ప్రయత్నించెను. వారు భయపడి బిగ్గరగా కేకలు వేసిరి. ఆ ప్రదేశములో సదాసర్వకాలములయందునూ మహాశాస్తా ధ్యానములో నిమగ్నుడైయున్న సత్యపూర్ణ మహర్షికి వారి కేకలు వినబడెను. అతడు
వేగముగా అచ్చటికి వచ్చి జయంతుడిని చూచి , నీవు చూచుటకు బ్రాహ్మణుడి వలె కనిపించుచున్నావు.
ఇటువంటి ఘోరకృత్యమును చేయదగునా? అని అడిగెను.

*“నాకు వేరొక వృత్తి మేమియు తెలియదు. జీవనము గడుపుటకు నేనేమి చేయగలను? మీరు సన్యాసులు కనుక మీరు వచ్చిన దారిన వెళ్లుము”* అని బదులిచ్చెను.

*“నీకు అవసరమైన ధనమును నేను ఇవ్వగలను. నీవు వీరిని హింసింపవలదు. వదలిపెట్టును”*
అని పలికి భగవాన్ మహాశాస్తా యొక్క మూలమంతమును జపించెను. భగవంతుడి దయవలన , ఇచ్చట అసంఖ్యాకమైన బంగారు నాణెములు , ధాన్యరాశులు కొండవలె కనిపించినవి. వాటిని
చూచి జయంతుడు ఆశ్చర్యచకితుడయ్యెను.

*“తాపస శ్రేష్ఠా ! ఇటువంటి అద్భుత శక్తిని పొందగల మార్గమును నాకు తెలియజేయుము”* అని
వేడుకొనెను. అతడి కుతూహలమును గమనించిన తాపస్తోముడు , *“నీవు చూచిన ఈ అద్భుత శక్తి , సర్వ ఐశ్వర్యప్రధాత అయిన మహాశాస్తా యొక్క మూలమంత్రమును అనుక్షణమూ జపించుచు , తపస్సు గావించినందు వలన నాకు కలిగెను. శాస్తా దివ్య దర్శనమునకు లభించెను. ఆయన అనుగ్రహము వలన నాకు ఇటువంటి మహిమ కలిగెను.*

*ఈ మూలమంత్రము అతి సూక్ష్మమైనది. ఆది మంత్రముగా దీనికి వైశిష్ట్యము గలిగెను. గురముఖముగానే దీనిని పొందవలయును. తదుపరి నిష్టతో జపింప వలయును. ఈ మంత్రమును.నేను నీకు ఉపదేశించుదును. నీవు ఏకాగ్రతతో దీనిని జపించుచు , తపస్సు చేయుము శాస్తా కల్పవృక్షమై నీ యెదుట నిలిచి , నీ అభీష్టమును నెరవేర్చును”* అని పలికి , ఆ మంత్రమును
జయంతుడికి ఉపదేశించెను.

జయంతుడు నిష్టాపరుడై తపస్సు చేయనారంభించెను. కొద్ధి దినములలోనే , అతడిలో గూడు కట్టుకొనియున్న అజ్ఞానము , ధనాశ మున్నగునవి తొలగిపోయెను. సత్యాన్వేషణ మొదలయ్యెను.
కొంతకాలము గడచిన పిమ్మట , భగవానుడు అతడి తపస్సుకు సంప్రీతుడై దర్శనమొసగెను.
జయంతుడు అతడిని చుట్టూ తిరిగి ప్రదక్షిణము గావించి , నమస్కృతులను అర్పించెను.

*భగవానుడు అతడిపై అనురాగ వీక్షణములను ప్రసరింపజేసి”* నా అనుగ్రహముతో నీవు కోరిన శక్తులను పొందగలవు. సకల వేదాగమములను అధ్యయనము గావించి మహాజ్ఞానవంతుడవు
కాగలవు. మంత్రధ్రువుడు అను తిరునామమును పొంది , ఆ పేరుతో సుప్రసిద్ధుడవు కాగలవు” అని అనుగ్రహించెను.

మంత్ర ధ్రువ మహర్షి , మహాశాస్తా యొక్క దివ్యానుగ్రహము పొంది , అతడిని ఉపాసించువారిలో
ప్రత్యేకమైన స్థానమును పొంది అందరి ప్రశంసలకు అర్హుడయ్యెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow