కంబంగుడికి వశుడైన విధము*
దయామయుడైన స్వామి కృపాకటాక్షములకు పాత్రుడైన *'విజయుడు'* అను పేరు గల బ్రాహ్మణ
వంశస్థుడు తమిళ దేశమునకు దక్షిణదిశలో గల కల్లడైకురిచ్చియందలి , కరందైమరపాళ్యమున
నివసించుచుండెను. అతడూ , అతడి సహధర్మిచారిణి సదాసర్వకాలములయందునూ శాస్తాయొక్క
దివ్యనామస్మరణమును జపించుచుండిరి. స్వామి యొక్క పవిత్రనామములే వారిరువురికి
ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములు. ఆలూమగలిరువురూ భగవద్భక్తులను ఆదరించుచూ , వారికి సపర్యలు గావించుచూ అమందానంద హృదయులై కాలము గడుపుచుండిరి. దైవభక్తులను మనము
అభిమానాదరములతో సేవించినచో , ఆ దేవుని యొక్క ప్రేమాభిమానములకు మనము అవశ్యము
పాత్రులమగుదుము , ఈమాటతథ్యము !
ఆ దంపతుల భక్తిని పరీక్షింపదలచినవాడై , స్వామి ఒక పరివారు వసించుచున్న కరందై
పాళ్యమును చేరెను. ఒక బాలకుడి వలె రూపమును ధరించి , ఆకలితో తీరనిబాధను పొందు చున్నట్లుగా నటించుచు , ఆ బ్రాహ్మణుడి కుటీరమును చేరెను. తనకు నమస్కరించి , దీనవదనుడై నిల్చిన శాస్తాను చేరబిలిచి దంపతులిద్దరూ ప్రియముగా మాట్లాడి , బాగోగులను విచారించిరి.
వారితో కొంత సేపు వినోదముగా కాలక్షేపము చేయవలెనని తలచిన శాస్తా వాస్తవ విషయమును దాచియుంచి , అయ్యా ! నేను బహుదూరదేశమునుండి వచ్చియున్నాను. మార్గములో గల
మిట్టపల్లములన్నిటిని దాటి , బహుశ్రమతో ఇక్కడికి చేరితిని నా ఆకలి బాధ పోగొట్టుటకు ఆహారము నిమ్ము. ఈరాత్రి మీ ఇంట గడుపుటకు అనుమతి నిమ్ము' అని వేడుకొనెను.
అతడి పాలుగారు వదనము గాంచి దంపతులిరువురూ కరుణార్థ హృదయులైరి. తేజో విరాజితమైన
ముఖము , వాక్ తర్యముగాంచి , ఇతడు సాధారణమైన మానవుడు కాదుసుమా , ఆభగవానుడే ఈతడు అని తలచిరి. *అతిథి దేవోభవ' అను వేదసూక్తిని అక్షరాలా తమ ప్రాణసమానముగా ఎంచునున్నటు వంటి ఆదంపతుల అంతరాత్మ అతడు దేవాది దేవుడు'* అను విషయమును
ప్రబోధించెను. ఆ గృహస్థుడు తన ఇల్లాలితో బాలకుడికి భోజనము పెట్టుమని కోరెను. ఆమె
ప్రేమాదరములతో అతడిని ఇంటిలోపలికి తీసుకొని వెళ్లి తాము భుజించునటువంటి అన్నము పెట్టి , ఆకలిని దీర్చెను. తమ ఇంట నిద్రించుటకు వీలును కల్పించెను.
వారి యొక్క నిరాడంబర జీవితమునకు , నిజాయితీ భావమునకు , భక్తజన పరిసేవలకు
సంతసముతో ఉప్పొంగుచు , తన నిజరూపము వారికి చూపదలచినవాడై , వారి యెదుట సాక్షాత్కరించెను. గాఢనిద్రపరవశులై యున్నదంపతులు ఒక్కసారిగా ఉలికిపడుచు మేల్కొనిరి. వారి
చర్మ చక్షువులకు తేజో విరాజితుడైన , సత్య స్వరూపుడైన , సర్వేశ్వరుడైన భక్త జనవాసుడైన పరమాత్మ
మహాశాస్తా దివ్యవిగ్రహము గానవచ్చెను.
బాలకుడిగా వచ్చినవాడు నిజముగా శివపుత్రుడే అని వాస్తవమును గ్రహించిన వారిరువురూ
ఆనందాశ్రువులు స్రవించుచుండగా తాండవమాడసాగిరి.
*"తండ్రీ ! ఏ కారణము లేకుండా మామీద దయను చూపించుటకై విచ్చేసిన కరుణామయహృదయా ! మమ్ములను ఆనందపరవశులను గావించుటకు వచ్చిన పరమేశ్వరా ? నీకరుణాకటాక్షవీక్షణము మామీద నిరంతరము ప్రసరించుచుండునట్లుగా అనుగ్రహింపుము. మా తదనంతర వంశీయులు కూడా నిన్ను భక్తితో కొలుచువారలై యుందురు గాక , అట్టివరమునిమ్ము''* అని వేడుచు అయ్యప్ప
దివ్యచరణముల మీదవ్రాలిరి.
తమ భక్తజనుల నిస్స్వార్థ భక్తి తత్పరతకు ఆనంద భరితహృదయుడై *'భక్తులారా ! నామీద అచంచల విశ్వాసము కలిగియున్న మిమ్ములను ఉద్ధరించుట కొరకై వేంచేసితిని. అతిథి జనులనాదరించి , వారిపరి చర్యలను చేయుచున్న మీరు నాకు ఆహారము నొసరి ప్రియమును గూర్చితిరి. మీ యొక్క భగవదారాధన అనునిత్యము కొనసాగుచుండునుగాక ! అన్న దాన ప్రభువైన నాకే మీరు భోజనము పెట్టి సంతృప్తిని కలిగించిరి. కనుక, నేను మీకు ఋణపడియున్నాను. మీరు , మీ సంతతివారు నా దయానుగ్రహమునకు అవశ్యము పాత్రులగుదురుగాక !* నన్ను మీరు తలచినంత
మాత్రమున మీకు కలిగినవి దుఃఖములను దూరము చేయగలను. మీకు ప్రత్యక్షము కాగలను నేను మీకు *'భక్త శాసనమును ప్రసాదించుచున్నాను. 'కంబంగుడి' అను ప్రదేశమును కూడా మీకు ఒసగుచున్నాను'* అని ఆశీర్వదించి , అదృశ్యుడయ్యెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*