*శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 14*

P Madhav Kumar

 

*శక్రాదిస్తుతి - 3*


"దేవీ! నీ శూలంతో మమ్మల్ని రక్షించు. అంబికా! నీ ఖడ్గంతో మమ్ము కాపాడు; నీ ఘంటా నాదంతో మమ్ము రక్షించు; నీ వింటి టంకారధ్వనితో మమ్ము పాలించు.


"చండికా! తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాలో నీ శూలాన్ని త్రిప్పుతూ మమ్ము, ఈశ్వరీ! కాపాడు.


"ముల్లోకాలలో సంసరించే నీ ఈ సౌమ్యరూపాలతో, అత్యంత ఘోరరూపాలతో మమ్ము, భూలోకాన్ని రక్షించు. 


"అంబికా! నీ ఖడ్గశూలగదాది ఆయుధాలు-నీ కరపల్లవాలను ఏ యే ఆయుధాలను స్పృశించాయో ఆ ఆయుధాలన్నింటితోను, మమ్ము సర్వదిశలా రక్షించు".


ఋషి పలికెను : దేవతలచేత ఈ విధంగా స్తుతించబడి, నందనోద్యాన లో దివ్య పుష్పాలతో, గంధద్రవ్యాలతో * , మైపూతలతో ఆ జగద్ధాత్రి (జగత్తును పోషించేది లేక జగన్మాత) అర్పించబడింది.


దేవి పలికెను : ఓ దేవతలారా! నా వల్ల మీరు ఏమి వాంఛిస్తున్నారో దానిని మీరంతా కోరుకోండి. (ఈ స్తోత్రాలతో మిక్కిలి ప్రీతి నొంది మీకు ప్రసాదిస్తాను). 


దేవతలు పలికారు: మా శత్రువైన మహిషాసురుడు భగవతి చేత (అంటే నీ చే) వధింపబడ్డాడు కనుక అంతా నెఱవేరింది. ఇంకేమీ మిగలలేదు.


మహేశ్వరీ! మాకు వరం ఇవ్వాలనుకుంటే, మేము మళ్ళీ నిన్ను ఎప్పుడేడు స్మరిస్తే అప్పుడప్పుడు మా మహాపదలను నివర్తిస్తూ ఉండు.


మరియు, నిర్మలముఖం గల ఓ అంబికా! మానవుడు ఈ శ్లోకాలతో స్తుతిస్తే - మాకు ప్రసన్నవైనట్లే అనుగ్రహించి ధనదారాది సంపదలు, అభ్యుదయం, విభవాలు అతడికీ సర్వదా ప్రసాదించు.


ఋషి పలికెను: 

రాజా! దేవతలచేత ఇలా లోకహితం కొరకూ తమహితం కొరకూ (స్తుతింపబడి) ప్రసన్నయైన భద్రకాళి "అట్లే అగు గాక!" అని పలికి అంతర్థానమొందింది.


నృపాలా! ముల్లోకాల హితాన్ని కోరే దేవి పూర్వకాలంలో దేవతల శరీరాల నుండి ఉద్భవించిన విధాన్ని ఇప్పుడు తెలిపాను.


మళ్ళీ దేవతలకు ఉపకారిణియై లోకరక్షణార్థం దుష్ట దైత్యులను, శుంభనిశుంభులను, వధించడానికి ఆమె గౌరిగా ఉద్భవించిన విధాన్ని తెలుపుతాను విను. అది ఎలా జరిగిందో అలాగే నేను చెబుతాను.


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “శక్రాదిస్తుతి” అనే చతుర్థాధ్యాయం సమాప్తం.

||


 *సశేషం.........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat