*దేవీ దూతసంవాదం - 3*
సర్వభూతాలలో కాంతి (అందం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో లక్ష్మీ (భాగ్యం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో వృత్తి (కార్యపరత) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో స్మృతి (జ్ఞప్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో దయాస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో తుష్టి (తృప్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో మాతృ (తల్లి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో భ్రాంతి (పొరపాటు) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాల ఇంద్రియాలను లోబరుచుకుని, సర్వభూతాలపై ఎల్లప్పుడూ ఏలుబడి కలది, సర్వవ్యాపకురాలు అయిన దేవికి నమస్కారాలు.
ఈ అఖిలజగత్తులో వ్యాపించి చిత్ (జ్ఞాన) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
పూర్వకాలంలో దేవతలతో తమ అభీష్టసిద్ధికై సుపించబడినది, సురపతి చేత ప్రతిదినం సేవింపబడేది, సర్వశుభాలకు మూలమైనది, అయిన ఈశ్వరి (పార్వతీదేవి) మాకు సర్వశుభాలను ఇచ్చి మా ఆపదలను అంతమొందించు గాక !
ఇప్పుడు మళ్ళీ గర్వోన్మత్త దైత్యులచే పీడించబడుతోన్న దేవతలమైన మా చేత భక్తి వినమ్రశరీరాలతో, నమస్కార పూర్వకంగా, స్మరించ బడుతోన్న ఆ దేవి మా ఆపదలనంన్నిటినీ తత్ క్షణమే అంతమొందించుగాక.
*సశేషం.......*