*దేవీ దూతసంవాదం - 7*
దూత పలికెను: దేవీ ! నీవు గర్వంతో ఉన్నావు నా ఎదుట అలా మాట్లాడవద్దు. ఈ మూడులోకాలలో ఏ మగవాడు శుంభనిశుంభుల ఎదుట నిలువగలడు?
ఇతర రాక్షసుల ఎదుట కూడా దేవతలందరూ యుద్ధంలో నిలువజాలరే! ఇక దేవీ! నీ సంగతి ఏమి చెప్పను- స్త్రీవి. ఒంటరిదానవు!
ఇంద్రాది దేవతలందరూ శుంభాదుల ఎదుట నిలిచి పోరాడ జాలకపోయారు. స్త్రీవి నీవు ఎలా వారి ఎదుట నిలువగలవు?
మాట మీదనే శుంభనిశుంబుల వద్దకు పొమ్ము, తలపట్టి ఈడువబడే గౌరవం పొందకుందువు గాక!”
దేవి పలికెను :
నీ మాటలు నిజమే. శుంభుడు బలవంతుడు; నిశుంభుడును మిక్కిలి పరాక్రమశాలి. (కాని) అనాలోచితంగా పూర్వమొనర్చిన శపథం ఉండగా నేను ఏం చేయగలను?
తిరిగి పోయి నేను ఇప్పుడు చెప్పినదంతా జాగ్రత్తగా రక్కసులటేనికి చెప్పు. ఏదియుక్తమో అది అతడు చేయు గాక.
శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో "దేవీ మాహాత్మ్యము" లో “దేవీ దూతసంవాదం” అనే పేరిటి పంచమాధ్యాయం సమాప్తం.
*సశేషం..........*