శ్రీ మహాశాస్తా చరితము - 100 | శనివార వ్రతము - శ్రీ శనిగ్రహ పురాణము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 100 | శనివార వ్రతము - శ్రీ శనిగ్రహ పురాణము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శనివార వ్రతము - శ్రీ శనిగ్రహ పురాణము*

లోకులందరికీ వెలుగును ప్రసాదించు సూర్యభగవానుడు , దేవశిల్పియైన విశ్వకర్ముని కుమార్తె అయిన ఉషాదేవిని పరిణమయమాడి యుండెను.

ఈ దివ్యదంపతులకు వైవస్వత మనుపు , యమధర్మరాజు , యమున అను ముగ్గురు బిడ్డలు కలిగిరి. కాలము గడచుచుండగా సూర్యభగవానుని ప్రకాశమును ఉషాదేవి తట్టుకొనలేక పోయినది.
కొంతకాలము అతడిని వీడి ఉండగోరినదై , తన నీడనుండి తన వలెనే నుండు ఛాయాదేవిని
సృష్టించి , తనకు బదులుగా ఉంచి వెడలిపోయెను.

ఛాయాదేవి కూడా సూర్యునికి పత్నియై , దాంపత్యము బూని సావర్ణిమనువు , శ్రుతకర్మ అను పుత్రులను , భద్రయను కుమార్తెను పొందెను.

తనకు బిడ్డలు జన్మించనంతవరకూ ప్రధమ భార్య బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకొనిన ఛాయాదేవి , రోజులు గడచిన కొద్దీ మారిపోయినది. ఏ కారణమూ లేకుండా ఉషాదేవి బిడ్డలను
చిన్నచూపు చుచుచూ వారిని ఎన్నో విధములుగా హింసించసాగెను.

*ఒకమారు యమునిపై కోపముబూని , అతడిని దండించగా , కోపావేశమున ఆమెపై కాలుని పైకి లేపెను. వెంటనే (ఛాయాదేవి) పైకి లేపిన ఆ కాలు అట్లే కుళ్లిపోవుగాక” అని ఆమె శపించెను.*

*యముడు ధర్మరాజుగా పిలువబడునుకదా ! అతడికి ఒక సందేహం కలిగింది. ఎంతో కోపము కలిగిననూ , తల్లి యైనటువంటిది ఇంతగా శపించదు కదా. తన సందేహమును తండ్రికి తెలియజేసెను అతడి తరపున గల న్యాయమును ఆలోచించిన సూర్యుడు నీవు ఎవరవు?”* అని
ప్రశ్నించగా , ఆమె సత్యము నంతయూ చెప్పివేసినది.

సూర్యుడు యమునితో అతడి శాపము పరిహారమగుటకు భూలోకమున చంద్రప్రభా నదీ తీరమున శ్రీ మహాశాస్తా స్వయంభువుగా వెలసియున్న వివరమును. అచటికి పోయి స్వామిని
పూజించినచో శాపవిమోచనము కలుగుననియూ చెప్పెను. తండ్రి మాట ప్రకారము , యముడు జాప్యేశ్వరమునకు పోయి మహాశాస్తాని ప్రార్థించి తన శాపమును పరిహరించుకొనెను. ఈ సంగతి తెల్సికొన్న ఛాయాదేవి పుత్రుడైన శ్రుతకర్ముడు , తాను కూడా మహాశాస్తాని పూజించి సద్గతి
నొందవలెనని తలచినవాడై జప్యేశ్వరమునకు పోయి రెండు సంవత్సరముల పాటు భక్తి శ్రద్ధలతో
పూజించెను. అతడి భక్తికి మెచ్చిన శాస్తా అతడిముందు ప్రత్యక్షమయ్యెను. శ్రుతకర్ముడు మేని పులకించగా , స్వామికి నమస్కరించి , అనేక విధములుగా స్తుతించెను అది విన్న శాస్తా , అతడి
యందు కరుణబూనినవాడై *“శ్రుతకర్మా ! నీ యొక్క మహోన్నతమైన పూజలను , ఆరాధనలకు మెచ్చుకుంటిని. నీవు వారము యొక్క ఆఖరి దినము యొక్క ఆదిపత్యము పొంది , శ్రేష్ఠమైన గ్రహపదవిని పొందుదువుగాక నీవు మంద గమనమున సంచరించు వాడగుటచేత శనీశ్వర నామము పొందుదువు గాక. సకల జీవుల యొక్క పాప పుణ్యములకు తగినట్లుగా ఒక న్యాయదేవత
వలె తీర్పులను ప్రసాదింతువు గాక. నీ యొక్క నిజమైన భక్తులను దండింపక , మంచి ఫలితములనే
ప్రసాదింతువు.

*నా మనస్సును ఆకట్టుకొను విధముగా ఆరాధించిన నీవు , శనివారమునందే ఆదిపత్యము వహించుట ముదావహము. ఆదినమున నన్ను ఆరాధించువారికి ఋణబాధలు , వ్యాధులు , శత్రుబాధలు మొదలగునవి తొలగిపోయి ఐశ్వర్యము , సుభిక్షము , శాంతి యుతమైన జీవితము అలవడునుగాక”*
అని ఆశీర్వదించెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow