శ్రీ మహాశాస్తా చరితము - 99 | బుధవార వ్రతమహిమ | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 99 | బుధవార వ్రతమహిమ | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

బుధవార వ్రతమహిమ*

గాంధార దేశమున , సోమపురం అనుచోట సోమకీర్తి అను విప్రుడు నివసించు చుండెను. అతడి భార్యయైన కల్యాణి , మహాశాస్తా భక్తురాలై ధర్మమార్గమున నడచుచుండెను. వారికి జన్మించిన కుమారుడైన *'వరదత్తుడు'* తల్లిదండ్రుల విధివశమున మిగతా శిశువుల వలె కాక మందబుద్ధి కలవాడై యుండెను. పదునెనిమిది సంవత్సరముల వయస్సు వాడైననూ , బుద్ధి ఏమాత్రమూ పెరుగక మూర్ఖుడై యుండెను.

ఇందులకై మిగుల చింతించుచూ , దంపతలిరువురూ తమ కుమారుని పట్ల దయ చూపుమని శాస్తాని ప్రార్థించసాగిరి. వారి భక్తికి లభించిన బహుమతి వలె ఒకనాడు నారద మహర్షి వారి వద్దకు ఏతెంచెను. ఆ దంపతుల నోకమునకు కారణమేమని ప్రశ్నించగా , విషయము తెల్సుకున్న వాడై
శాస్తా అనుగ్రహము కొరకు ఆచరించు బుధవార వ్రత మహిమను , ఆచరణా విధానమును తెలిపెను.

ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో ఒక సంవత్సరకాలము ఆచరించగా , స్వామి ఒక వేద బ్రాహ్మణ వేషము ధరించిన వాడై , వరదత్తుని స్వప్నమున సాక్షాత్కరించెను స్వప్నమందే విభూతిని ప్రసాదముగా పంచి , ఆశీర్వదించెను. వరదత్తుడు మరునాడు మేల్కొంచినంతనే అందరూ ఆశ్చర్యపడువిధముగా ,
ఎవరివద్దకు పోయి నేర్చుకొనకుండానే. అమిత ప్రజ్ఞాశాలియై భాసిల్లి చుండెను.

ఆ సమయమునందు , రాజ్యముఖ్యమంత్రి మరణించి , వారసులు లేకపోవుటచే కొత్తవారిని
ఎన్నుకొనుటకై ఒక ఏనుగు ఏర్పాటు చేయబడినది. ఆ ఏనుగు చేత పుష్పమాలను ధరించి ,
నగరమంతయూ కలియదిరుగసాగెను. స్వామి యొక్క కృపవలన దానిదృష్టి విద్యాధరునిపై పడి , అతడి మెడలో మాల వేచి అతడిని వరించినది. అట్టి విధముగా శాస్తా యొక్క కృపవలన కీర్తి ప్రతిష్టలతో వెలుగొందెను.

ఈ విధముగా బుధవార వ్రతము జ్ఞానమును , కీర్తి ప్రతిష్టలను , బుద్ధి కుశలతను కలుగుచేయునట్టిది.

ఈ వ్రతమును పాటించిన వ్యాసభగవానుడు పదునెనిమిది అష్టాదశ పురాణములను , భారత
కావ్యమును రచించెను. శుక మహర్షి శాస్తాయొక్క అనుగ్రహము కారణముననే భాగవతమును
రచించెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow