పశుపతినాథ్ నేపాల్ లో పాల్గుణ మాస అమావాస్య శుభకృత్ నామసంవత్సరము చివరి రోజున పరమేశ్వరుడి జటాజూట రదోత్సవం, ఈ ఉత్సవం మహా విశేషమైనది....🙏


 టచ్ చేసి వీడియో చూడండి


హే పశుపతి సర్వ పాప స0హారకా
   నీకు దూర0బైతి నిన్ను వీడి
సార0బు లేనట్టి సంసార సంద్రము
   న0దవివేకినై యకట మరల
మరల నే భ్రా0తిచే దిరుగుచు నుంటిని
   పూని ముల్లోకముల్ బ్రోచు ఆది
దేవుడ వీవు గాదె.?శివ,కరుణ నను
     కావగ వేడితి నీవె దిక్కు
యనుచు నమ్మితి మది కాల హరణ మేల?
కరిముఖ జనక కందర్ప గర్వ హరణ
సతము సద్భక్తి నినుగొల్తు శార్వరీశ
ధన్యురాలను జేయుమా ధ్యాన గమ్య.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!