SUPRABHATA SEVA AT SRIVARI TEMPLE TO RESUME FROM JANUARY 15 _ జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala, 12 January 2024: As the holy month of Dhanurmasam ends on January 14, Suprabhata Seva will resume at the Srivari Temple in Tirumala from January 15.

 

On December 17 last, Dhanurmasam commenced at 12.34 am replacing Suprabhatam with Andal Sri Goda Tiruppavai recitation.

 

But as Dhanurmasam concludes on January 14, Suprabhata Seva will resume in Srivari temple as usual from January 15.  

 

Similarly, Godaparinayotsavam will be held at Srivari Temple on January 16 and Parveta Utsavam at Parvetamandapam in the afternoon.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, 2024 జనవరి 12: పవిత్రమైన ధనుర్మాసం జ‌న‌వ‌రి 14వ తేదీ ఆదివారం ముగియనుండడంతో జ‌న‌వ‌రి 15వ తేదీ సోమ‌వారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.

గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్ల‌వారుజామున 12.34 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికానుండ‌టంతో, జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి.

అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/C1DMeEr
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!