శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2024 ఫిబ్రవరి 22: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

పరదాలు విరాళం :

తిరుపతికి చెందిన శ్రీ మ‌ణి రెండు పరదాలు, రెండు‌ కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

29-02-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

01-03-2024

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

02-03-2024

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

03-03-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

04-03-2024

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

05-03-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

06-03-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

07-03-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

08-03-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్లకు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.



from TTD News https://ift.tt/G7p35zN
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!