DEVUNI KADAPA ANNUAL FEST FROM FEBRUARY 10 _ ఫిబ్ర‌వ‌రి 9న దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ

Tirupati, 08 February 2024: The Annual Brahmotsavams of Sri Lakshmi Venkateswara Swamy temple in Devuni Kadapa are scheduled to be held from February 10 to 18 in YSR Kadapa district with Ankurarpanam on February 9 between 6 pm and 9 pm. 

The Brahmotsavam will begin on February 10 at 10.30 am with Dhwajarohanam. The important days includes, Garuda Vahanam on February 14, on February 15 Kalyanotsavam will be performed for which two persons will be allowed on the purchase of a Rs.300 ticket, Godhooli Utsavam and Rathotsavam on February 16, Vasanthotsavam, Chakra Snanam and Dhwajavarohanam on February 18.  

On February 19, Pushpayagam will be observed from 6pm onwards.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 9న దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

ఫిబ్రవరి 08, తిరుపతి, 2024: వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడపలో గ‌ల‌ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వరి 10 నుండి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్ర‌వరి 9వ తేదీ శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భ‌క్తులు పుష్పాల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

10-02-2024 ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం.

11-02-2024 ఉద‌యం సూర్యప్రభవాహనం, రాత్రి, పెద్దశేష వాహనం.

12-02-2024 ఉద‌యం చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం.

13-02-2024 ఉద‌యం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం.

14-02-2024 ఉద‌యం ముత్యపుపందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం.

15-02-2024 ఉద‌యం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం.

16-02-2024 ఉద‌యం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం.

17-02-2024 ఉద‌యం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం.

18-02-2024 ఉద‌యం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి హంసవాహనం, ధ్వజావరోహణం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/WJ8VHgy
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!