SRI RAMA NAVAMI ASTHANAM AT SRIVARI TEMPLE ON APRIL 17 _ ఏప్రిల్ 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

•  SRI RAMA PATTABHISHEKAM ON APRIL 18

 

Tirumala,29  March 2024: TTD is organising a grand Asthana fete at Srivari temple on the occasion of the Sri Rama Navami festival on April 17.

As part of the festivities, Lord Rama will ride Hanumantha Vahana on Mada streets and bless devotees. Similarly, an impressive Sri Rama Pattabisekam fete will be observed on April 18. 

The utsava idols of Sri Sitarama Lakshmana Samata Hanumanta will be given snapana thirumanjanam at the Ranganayakula Mandapam in the morning of Wednesday. There will be Hanumanta Vahana Seva in the evening on Mada streets. Thereafter at night, the Sri Rama Navami Asthanam will be held at the Bangaru Vakili inside the Srivari temple.

In view of day-long festivities, TTD has cancelled the Sahasra Dipalankara Seva in the evening.

Similarly, the Srivari temple archakas will grandly conduct the Sri Rama Pattabhisekam fete at Bangaru Vakili on the night of April 18 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

– ఏప్రిల్ 18న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల, 2024 మార్చి 29: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వ‌హిస్తారు.

శ్రీరామనవమి సందర్భంగా బుధ‌వారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.



from TTD News https://ift.tt/94HIjAR
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!