VENUGANALAMKARAM ON DAY 2 _ వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి చిద్విలాసం

Vontimitta, 18 April 2024: As part of the ongoing Sri Kodanda Rama Swamy Brahmotsavam at Vontimitta, on the second day on Thursday morning, Sri Rama offered darshan to His devotees along the four Mada streets of the temple, decked in Venugana Alankaram.

From 7.30 in the morning, the procession of Swamy took place in grandeur.  While groups of artists glorified the procession with colourful chekkabhajans and kolatams, the Lord paraded along the streets with majesty blessing devotees.  

Later, Snapana Tirumanjanam ceremony will be held in the temple.  In this, milk, curd, honey, turmeric, coconut water and sandalwood paste will be offered to the Utsava Murthies while performing Abhishekam.

Temple Deputy EO Sri. Natesh Babu, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen and others participated in the procession

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి చిద్విలాసం

ఒంటిమిట్ట‌, 2024 ఏప్రిల్ 18: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.



from TTD News https://ift.tt/e5WiGpU
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!