BHASHYAKARA UTSAV BEGINS IN TIRUMALA _ తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం

Tirumala, 03 May 2024: The Bhashyakara Utsavam commenced at the Tirumala on a grand religious note on Friday in Srivari temple. This festival will be observed for 19 days and Sri Bhashyakarla Sattumora will be held on May 12.

Bhagavad Ramanujacharya wrote a commentary on Mimamsa Grandha called “Sribhashyam” on the basis of Vishistadvaita theory. That’s why they he was named Bhashyakara.

Bhashyakarla Sattumora is being observed in Srivari Temple every year in the advent of Arudra Nakshatra on the day in which Sri Ramanuja was born.

On the first day of the Bhashyakara Utsavam, on Friday morning, after the first bell in the Srivari temple, a procession of Sri Ramanuju was conducted on a golded Tiruchi in the four Mada streets of the temple. 

On this occasion, the Jeeyangars conducted a Divya Prabandha Goshti. HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, temple officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం

తిరుమల, 03 మే 2024: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 12న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున శుక్ర‌వారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/vOuoiNZ
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!