JAMMALAMADUGU ANNUAL FEST FROM MAY 21 – 29 _ మే 21 నుండి 29వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 02 May 2024: The annual Brahmotsavam of Jammalamadugu Sri Narapura Venkateswara Swamy will be held from May 21 to 29 with Ankurarpanam on May 20.
 
Vahana Sevas will be held at 8 am and 7 pm every day during Brahmotsavam.  
 
Pushpa yagam will be performed on May 30 from 6pm onwards.
 
Among the important vahana sevas, Garuda Seva will be on May 25
Kalyanotsavam is on May 26,  Rathotsavam on May 27, Chakra Snanam on May 29.
 
Grihastas can participate in  Kalyanatsavam by paying Rs.300/- per ticket on which two devotees will be allowed.  
 
During annual Brahmotsavam, daily devotional music program, Harikatha, Kolatams etc. will be organized under the auspices of Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project, Annamacharya Project of TTD to entertain devotees.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 21 నుండి 29వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 మే 02: జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుండి 29వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 20వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 30వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

21-05-2024

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం- పెద్దశేష వాహనం

22-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం- హంస వాహనం

023-05-2024
ఉదయం – ముత్యపుపందిరి వాహనం

సాయంత్రం- సింహ వాహనం

24-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం- హనుమంత వాహనం

25-05-2024

ఉదయం – పల్లకీ ఉత్సవం

సాయంత్రం- గరుడ వాహనం

26-05-2024

ఉదయం – సర్వభూపాల వాహనం

సాయంత్రం- కల్యాణోత్సవం, గజ వాహనం

27-05-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం- అశ్వవాహనం

28-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం- చంద్రప్రభ వాహనం

29-05-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం- ధ్వజావరోహణం

మే 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/vzDVn7g
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!