Kedarnath Temple 2023 : శీతాకాలం దృష్ట్యా కేదార్ నాథ్ ఆలయం మూసివేత


శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి వేస్తామని బద్రినాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్ నాథుని పంచముఖి డోలిని పూజారులు భజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉభీమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయంలో భద్రపరిచారు.


Kedarnath Temple Closed : ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం మూతపడింది. శీతాకాలం దృష్ట్యా కేదార్ నాథ్ ఆలయ మహా ద్వారాన్ని భయ్యా దూజ్ సందర్భంగా బుధవారం మూసివేశారు. ఈ ఆలయం శీతాకాలమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. తెల్లవారుజామునే చలిలో వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకోగా, పూజారులు శివుడికి పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 గంటలకు మహా ద్వారాలను మూసివేశారు.


ఆరు నెలలపాటు ఆలయం తలుపులు మూసివుంటాయి. శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి వేస్తామని బద్రినాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్ నాథుని పంచముఖి డోలిని పూజారులు భజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉభీమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయంలో భద్రపరిచారు.

శీతాకాలమంతా స్వామివారికి అక్కడే పూజలు నిర్వహిస్తారు. మరోవైపు ఈ సీజన్ లో కేదార్ నాథుడికి 19.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ వెల్లడించారు.




Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!