BHASHYAKARA UTSAVAM AT SRIVARI TEMPLE FROM 3RD MAY _ మే 3 నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్స‌వం

Tirumala, 29 April 2024: Bhashyakarula Utsavam will be held from May 3 to 21 at Srivari Temple in Tirumala.  

During this festival, both Ubhayam offerings will be made for 19 days. 

Bhasyakarula Sattumora will be held on May 12 in the advent of Arudra Nakshatram in the month of Vaisakha, the day when Sri Ramanujacharya was born.

On the occasion of Sri Bhashyakarula Sattumora, after the  Sahasra Deepalankara Seva, Sri Devi Bhudevi Sri Malayappa Swamy will be taken on a procession on one Tiruchi while Sri Bhashyakarula varu on another Tiruchi through the streets of the temple.  

Jeeraswamis, Ekangis and others will participate.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 3 నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్స‌వం

తిరుమల, 2024 ఏప్రిల్ 29: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 3 నుండి 21వ తేదీ వ‌ర‌కు భాష్యకార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగ‌నుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 12వ తేదీన భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/4HoCJne
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!