PATRAPUSHPA YAGAM AT SRI KAPILESWARA SWAMY TEMPE ON MAY 23 _ మే 23న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగం

Tirupati, 29 April 2024: Patrapushpa Yagam will be held on May 23 at Sri Kapileswara Swamy temple in Tirupati.  

Ankurarpanam will be held for this purpose on May 22. As a part of this, on May 23 from 7.30 am to 9.30 am, Snapana Tirumanjanam will be conducted for Somaskandamurthy.  

Patrapushpayaga mahotsavam will be held from 10 am to 12 noon.  In this abhishekam is done with different kinds of flowers and leaves like tulsi, chamanti, ganneru, mogali, sampangi, rose, and lilies.  

Thiruveedhi Utsavam will be held from 6 pm to 8 pm. 

Grihastas (two persons) can participate in Patrapushpayagam by paying Rs.200/- per ticket.

Annual Brahmotsavams were held in this temple from March 1 to 10.  

During this festival, priests perform Patrapushpa Yagam as a Parharotsavam for the mistakes made by the staff, religious staff, devotees either knowingly or unknowingly.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 23న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగం

తిరుపతి, 2024 ఏప్రిల్ 29: తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 23వ తేదీ ప‌త్ర‌పుష్పయాగం జ‌రుగ‌నుంది. ఇందుకోసం మే 22వ తేదీన సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా మే 23న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు సోమ‌స్కంద‌మూర్తికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలు, ప‌త్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది. గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.

ఈ ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/sMbHpqX
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!