BENGALURU GIRL WRITES GOVINDA KOTI AND GETS SRIVARI BLESSINGS _ మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన బెంగుళూరుకు చెందిన కుమారి కీర్తన

Tirumala, 30 April 2024: Her eyes twinkled and tears of joy gushed out as soon as she had the darshan of Sri Venkateswara from the nearest distance in Tirumala temple.

For the 17-year-old teen from Bengaluru, jubilation found no bounds as she completed her ”Ista Daiva” darshan on Tuesday.

Kumari Keerthana, the girl hailing from Bengaluru has set a rare record for having completed the prestigious ‘Govinda Koti’ within a short time.

Sharing her divine experience she said that the tradition of writing Ramakoti is in vogue for several decades in Indian society.  

She said that she used to see her elders and villagers writing Ramakoti since her childhood.  She expressed that she felt so lucky that she got the opportunity to write Govinda Koti with the grace of Sri Venkateswara Swamy where she began in 2023 Navratri.  She said she penned every morning and evening with utmost devotion.

It may be mentioned here that the TTD has introduced a massive program of writing ”Govinda Koti” to develop spirituality among students, young men and young women.  

As a part of this, the TTD has decided to provide break darshan to those(individuals only) who have written Govinda Koti for 10 lakh 1,116 times and break darshan to the entire family along with those(individual) who have penned Govinda Koti ten million times.

For the first time, an Inter student from Bangalore has set the record of having written Govinda Koti for 10 lakh 1,116 times.

TTD wished a bright future with the benign blessings of Sri Venkateswara Swamy to Kumari Keertana, who completed the divine task with her perseverance within a short span.

Deputy EO of Srivari Temple Sri Lokanatham made her necessary arrangements for Srivari darshan.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన బెంగుళూరుకు చెందిన కుమారి కీర్తన

– విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న కీర్తన

– శ్రీ‌వారి అనుగ్ర‌హంతో గోవింద కోటి రాశాను

తిరుమల, 2024 ఏప్రిల్ 30: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన‌ విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది.

ఈ సంద‌ర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదైవము అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోవింద కోటిని భక్తిశ్రద్ధలతో రాసినట్లు తెలిపారు.

చిన్నతనం నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10 లక్షల మార్లు గోవింద కోటి రాయగలిగినట్లు చెప్పారు. గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు.

విద్యార్థులు, చిన్న పిల్లలు, యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి ప్రవేశపెట్టిన విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, కోటి సార్లు గోవిందా కోటి రాసిన వారికి, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/fmQPxyD
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!