AYODHYAKANDA AKHANDA PARAYANAM ON MAY 6 _ మే 6న అయోధ్యకాండ 10వ విడ‌త‌ అఖండ పారాయ‌ణం

Tirumala, 04 May 2024: The 10th episode of Ayodhyakanda Akhanda Parayanam will be held on May 6 at Nadaneerajanam stage in Tirumala.
 
SVBC will telecast the program live from 7 am to 9 am for the sake of global devotees.
 
A total of 164 shlokas will be recited in five sargas from 35 to 39 from Ayodhyakanda, 25 slokas of Yogavasishtam and Dhanvantari Mahamantra, total 189 shlokas.  
 
Dharmagiri SV Veda Vijnana Peetham, SVVeda University, TTD Vedic Scholars, TTD Sambhavana Scholars, Sri Annamacharya Project, National Sanskrit University Scholars will participate in this program.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 6న అయోధ్యకాండ 10వ విడ‌త‌ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2024 మే 04: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మే 6వ తేదీ 10వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అయోధ్యకాండలోని 35 నుండి 39వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 164 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 189 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/gVPtkJh
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!