PUSHPA YAGAM OF SRI GOVINDARAJA SWAMY ON JUNE 14 _ జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం

Tirupati, 10 June 2024: The annual Pushpa Yagam will be performed in Sri Govindaraja Swamy temple on June 14.  For this purpose, Ankurarpanam will be held on June 13 from 6.30 pm to 8 pm. 

As part of this, on June 14 from 9.30 am to 11 am, Snapana Tirumanjanam will be held for the utsavarlu of Sri Govinda Raja Swamy along with Sridevi Bhudevi. 

Pushpa Yagam will be held from 1 pm to 4 pm.  In this, the deities are offered floral baths with flowers like chamanti, gunneru, mogali, jasmine, Jaji sampangi, rose and lilies.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం

తిరుపతి, 2024 జూన్ 10: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూన్ 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుండి 4 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/pdMNTxq
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!