DEITIES RIDE ON HAMSA _ హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Vontimitta, 18 April 2024: The utsava idols of Sri Sita Rama and Lakshmana rode on Hamsa Vahana on the night of the second day of the ongoing annual Brahmotsavam in Vontimitta to the accompaniment of bhajans, kolatams, enthralling the devotees along Mada streets on Thursday.

Hamsa Vahana signalled Lord’s capacity to distinguish between milk and water (good and evil) in the universe. 

With this carrier, the Lord sends a message that He is Paramahamsa Tatva and ultimate destination to attain salvation.

TTD temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం
 
ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 18: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం రాత్రి 7 గంటల నుండి  హంస వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు  భక్తులకు అభయమిచ్చారు. 
 
భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది.  భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓలు శ్రీ నటేష్ బాబు,  శ్రీమతి ప్రశాంతి,
సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ న‌వీన్ ‌ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


from TTD News https://ift.tt/iUsPWwR
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!