🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*బుద్ధుడు , శాస్తా వీరి గురించిన ప్రసక్తి*☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి (ABADPS)*
శాస్తా , బుద్ధ భగవానుని అంశయే నన్నది మరియొక వాదము. *'అమరకోశం'* అను ఉత్తరాది నిఘంటువులో 'బుద్ధ' నామమునకు మరియొక పేరు *'శాస్తా'* అని ఉండుటను బట్టి బుద్ధుడు , శాస్తా ఒక్కరే నందురు. *'స్వామియే శరణం'* అను అయ్యప్ప శరణుగోషని , బౌద్ధమతస్థుల *'శరణాగతి'*
తత్వముతో ముడి పెడుచున్నారు. ఇంకా మరి కొందరు శాస్తా ఆలయములన్నీ బౌద్ధ ఆరామములే నందురు. ఇందులో ఏ పోలికలూ మనకి కానరావు.
శాస్తా ఒక యోగీశ్వరుడు. అతడు పలుచోట్ల శివధ్యానమున తీవ్రమైన యోగి వలె కనిపించును.
ఇట్టి ధ్యానయోగ భంగిమలను చూసి శాస్తాను బుద్ధునిగా భావించుట సమంజసమేనా ?
బుద్ధుడు అహింసామూర్తిగా అగుపించును. మరి శాస్తా సర్వాయుధభూషితునిగా విల్లు , శరము ,
కత్తి , ఖడ్గము వంటి ఆయుధములు ధరించిన వీరునిగా దర్శనమిచ్చును. ఇరువురికీ పోలికయే
కనిపించదు.
*'బౌద్ధసంఘ వినాశనాయ నమః”* అను నామం శాస్తాకి ఉండుట గమనార్హము.
*'అమరకోశం'* లోనే కాక విష్ణుసహస్రనామములోనూ , శివసహస్రనామంలోనూ ఇరువురినీ శాస్తా అని సంబోధించుట మనము చూడగలము.
మన సనాతన మతమునకు జీవం పోసిన ఆదిశంకరులవారు *'అమరకోశం'* లిఖించిన అమర సింహునికి సమకాలీనులు , ఆదిశంకరాచార్యులు బుద్ధమతమును మొదలంతా ఖండించినవారు.
ఆదిశంకరాచార్యులవారు శాస్తా యొక్క ఆశీర్వాద ప్రవాహమున తడిసి 2500 సంవత్సరములకు
మునుపే శాస్తాని పలువిధములుగా స్తుతించుయున్నారు. ఆలయ ప్రతిష్ఠ కూడా చేసి యున్నారు. ఆ
దైవమును స్తుతించుచూ ఎన్నియో పాటలు పద్యములు కూడా పాడియున్నారు.
శాస్తా అను పదమునకు ప్రత్యక్ష పదము అధికారి అనునది. అధికారము చేయు వ్యక్తి అని
అర్థము. అమరకోశము లోని బౌద్ధనామములలో శాస్తా అను నామము కనిపించుట నిజమయే , కాని హరిహరపుత్రుడైన మహాశాస్తకును , బుద్ధునికి సంబంధించిన తధాగతుడు , శాక్యముని వంటి ముఖ్యనామములు కనబడుటలేదు. ఇవన్నీ మహావీరుని పేర్లుగా చెప్పబడినవి. అందుకని శాస్తా మహావీరుని అంశయేనని చెప్పలేము కదా ! పేర్లు , పోలికలను బట్టి ఇరువురూ ఒక్కటేనని భావించుట
సరికాదు.
కంచి కామాక్షియే బౌద్ధమతస్థుల తారాదేవి ఆకృతి. తిరుపతి వేంకటేశ్వరస్వామి భంగిమ బుద్ధుడు నిలుచుని యున్న భంగిమని పోలియుంటుంది మరి కొందరు వినాయక నామం కూడా బుద్ధునిదే నంటారు. ఈనాడు ప్రతిచోటా కనిపించు వినాయక ప్రతిమలు గల గుడులన్నీ బౌద్ధ
ఆలయములే నంటారు. అంటే ఎన్నో వేల ఏండ్లుగా వున్న సనాతన మతం గల మన దేశంలో ,
అంత వరకూ ఆలయములు లేకుండానే ఉన్నామా ? ఇవన్నీ ఎంత సమంజసము కాదో , శాస్తా ఆలయములను బౌద్ధ ఆలయములతో పోల్చుట కూడా సమంజసము కాదు. బుద్ధుని , బుద్ధునిగానే
ఆరాధించుచున్నాము. *'స్వామియే శరణం'* అను శరణు ఘోషతో బుద్ధ మతాన్ని, శాస్తా పూజా విధానముతో పోల్చుట సరికాదు. శరణాగతి తత్వము కేవలము బుద్ధమతమునకు మాత్రమే సంబంధించినది కాదు.
*“సర్వ ధర్మాన్ పరిత్యంచ మాం ఏకం శరణం ప్రజ”*
అంటూ శరణాగతి తత్వము యొక్క సంపూర్ణ అర్థము స్ఫురింపజేయు 'శ్రీమద్ భగవద్గీత' నేటికి
సుమారు 5100 ఏండ్లకు ముందునాటిది. ఇదే తత్వము బుద్ధునికి కూడా అన్వయించబడినది.
బౌద్ద మతం మాత్రమే కాదు , బుద్ధుని జననకాలం ముందు నుండే శాస్తా సంప్రదాయం
ఉందన్నమాట వాస్తవం. ఇంకా పలుచోట్ల పలు ఆధారములు చూపబడ్డాయి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*