‌RED ANTHURIUM – BLUE ORCHIDS – HYDRANGEA LIGHT UP THE KALYANAM VENUE _ తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌

Vontimitta, 22 April 2024: The Kalyana Vedika venue at Vontimitta provided a paradise gained feel to the participants on Monday evening.

The entire celestial wedding stage is decked with four tonnes of ornamental, traditional, exotic flowers besides 30 thousand cut flowers for the occasion.

The blue orchids, Red Anthurium, Hydrandea and other flowers enhanced the grandeur of the stage. The electrical illumination recreated a heavenly feel to the devotees.

About 200 florists comprising 100 TTD Garden and 100 experts from Hyderabad spruced up the stage with beautiful decoration.

The paddy grains garlands, mangoes, coconut flowers, band banana leaves added a traditional look to the stage.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌
 
–    ప్రత్యేకంగా వడ్ల గింజలతో పూల పరద 
 
ఒంటిమిట్ట, 2024, ఏప్రిల్ 22: ఒంటిమిట్టలో జ‌రుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.
 
 ప్రత్యేకంగా వడ్ల గింజలతో పూల పరధ ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ కీతలు, టెంకాయపూత, అరటి ఆకులు,  మామిడాకులు, మామిడికాయలు, ద్రాక్ష,  తదితర ఫలాలు, చిలకలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం, హైడ్రామ్ జియా, జిప్సోఫల, తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయపుష్పాలు,  30 వేల కట్‌ ఫ్లవర్స్‌  వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కలకత్తా, బెంగుళూరు, హైదరాబాదుకు చెందిన 100  మంది అలంకరణ నిపుణులు, 100 మంది టీటీడీ సిబ్బంది  ఇందుకోసం పనిచేశారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


from TTD News https://ift.tt/kEcxNSe
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!