🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పురాణ కథ ప్రారంభము*☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి (ABADPS)*
*
*ధరణి యందు అవతరించిన తారక ప్రభువు*
*తన్మాహాత్మ్యం పురాణేషు బహుదా వర్ణితం వరా*
*బహూ ని తస్య క్షేత్రాణి పృధివ్యాం , నామ భేదతః*
*విశిష్టాని ప్రకాశాంతే సేతి హాసైః విశేషతః*
శాస్తా యొక్క గొప్పతనం గురించి పురాణ గ్రంధములలో పలు విధములుగా వర్ణించబడినది.
భూలోకమున అనేక స్థలములలో , అతడికి పలు ఆలయములు నిర్మించబడినవి. పలుచోట్ల అనేక మహిమలు కానవచ్చుచున్నవి.
చిదంబర రహస్యంలో సూతమహాముని శౌనకాది మహామునులకు తెలిపిన వృత్తాంమును
వివరించుచున్నాను. సాక్షాత్తూ భగవంతుని సృష్టితో విరాజిల్లు నైమిశారణ్యము అస్సంపన్నులైన
శౌనకాది మహామునులు తపస్సు చేసికొనుటకు అనువైన ప్రదేశముగా ప్రకాశించుచుండినది.
భగవంతుని ఆదేశానుసారముగా చూపబడిన ఈచోట , ప్రశాంత చిత్తులై తమ తమ తపస్సులను
కొనసాగించుచూ జీవించసాగిరి. వారిని కలసికొను నిమిత్తమై సూతమహాముని తన పరివారముతో
ఏతెంచెను. వ్యాసమహాముని యొక్క ప్రధమశిష్యుడైన సూత మహామునిని సాదరముగా ఆహ్వానించి ,
నైమిశారణ్యపు మునిపుంగవులు పలు తెరంగుల మర్యాదలు చేసిరి. మానవ మనుగడతో వ్యర్థ
జీవితమును గడుపు మానవులు భగవంతుని చేరు ఉన్నత మార్గము చూపు పురాణ ఇతిహాసగాధలను
వివరించమని ప్రార్థించిరి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశ కలిగిన సూతుడు తన గురుదేవులకు
మనస్సుమాంజలి ఘటించి , ఆయనచే వీరచితమైన పురాణగాధలను వివరింపసాగెను.
ఈ విధముగా భగవంతుని యొక్క పలువిధములైన లీలావిశేషము లను గాధలుగా చెప్పబడినవే
బ్రాహ్మం (బ్రాహ్మ పురాణం), పద్మం (పద్మ పురాణం) వైష్ణవం (విష్ణు పురాణం లేక శ్రీదేవీ బాగవత పురాణం, నారదీయం (నారద పురాణం), మార్కండేయ పురాణం , ఆగ్నేయం (అగ్ని పురాణం),
భవిష్యపురాణం బ్రహ్మ వైవర్తత పురాణం , లింగ పురాణం , వారాహం (వారాహ పురాణం) స్కాందం (స్కంద మహాపురాణం), వామన పురాణం. కౌర్మం (కూర్మ పురాణం) మాత్స్యం (మత్స్య పురాణం),
గారుడం (గరుడ పురాణం , బ్రహ్మాండ పురాణం అను అష్టాదశ పురాణములు పదునెనిమిది పురాణములు. ఇన్నిటిని చెప్పిననూ తనివి తీరని మునులకు , మరియొక పదునెనిమిది
ఉపపురాణములను , పలుక్షేత్ర పురాణములను , మరిన్ని గ్రంధములను తెలిపెను.
పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే అయిననూ , అతడి యొక్క పలువిధములైన అవతార విశేషములను
సూతముని వివరించెను. అండ బ్రహ్మాండమంతయూ తేజోవంతుడై అవతరించియున్న భగవంతుడు,
ప్రత్యేకముగా అవతరించు కారణమును , అతడి లీలా వినోదములను , ఆయా కాలమున కనిపించిన చారిత్రక ఋజువులను పురాణగాధల ద్వారా ఉపకధలుగా తెలిపెను.
*'హరిహరపుత్రుడు, హరిహరాత్మజుడు'* అంటూ కొనియాడబడు స్వామి పూజనీయుడు. కోట్లాది జీవులకు వందనీయుడు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*