అమృత బిందువులు - 26 సామాజిక తత్వం - 2

P Madhav Kumar


*సామాజిక తత్వం - 2*

ఐకమత్యముతో నిలచి , శాంతిని పెంపొందించుటయే యువత లక్ష్యముగా ఉండాలి.


అహంకారము అగ్నివంటిది. అగ్ని దహించినట్లు అహంకారులు మాటలతో సమాజాన్ని దహించి వేయగలరు.


నిగ్రహము లేని జీవితము అదుపు ఆనకట్ట లేని నది వంటిది. అది ఎప్పుడైనా ఎవరినైనా ముంచివేయగలదు.


తక్కువ మాట్లాడండి. ఎక్కువ సాధించండి.


విద్యా ధనం విరివిగావున్నా గర్వము లేకుండా చరించేవాడే పండితుడు.


జరుగరానిది జరిగిందని ఆత్మను క్షోభపెట్టుకోకు. ఆత్మను క్షోభ పెట్టుకుంటే ఆశలన్నీ అణగారి పోగలవు.


ఆశలేని జీవితము తరిగే వృక్షము లాంటిది.


పరుల మేలు దలచే వారే పవిత్ర హృదయులు.


నీతి పరులకు నిందలు అడుగడుగునా వెంబడించుతూ అవమానిస్తూనే వుంటాయి.


చెరువునకు కట్టరక్షణ. మానవుని దేహమునకు మనస్సు రక్షణ.


సాధన వెలుగు లాంటిది. వెలుగులో దేనినైనా చూడగలిగినట్లు , సాధనతో దేనినైనా సాధించవచ్చు.


మమతల దీపాలను వెలిగిస్తూ , మానవత్వాన్ని చాటుతూ , సమానత్వాన్ని చూపించేదే నిజమైన మతము.


కులాల చిచ్చు , మతాల ఉచ్చు , అసమానతల హెచ్చులేనిదే స్నేహము.


సమాజాన్ని త్యజించిన వాడు సన్యాసి , సమాజం చేత త్యజించబడిన వాడు సన్నాసి.


చేయని తప్పుకు నిందలు వేయడమంటే నిలువునా సమాధి కట్టినట్లే. కావున ఎవరిమీద నిందవేయరాదు.


నిరాశ నిలువునా క్షీణింప చేయగలదు. ఆశ మోడు వారిన వృక్షాన్ని చిగురింపజేసినట్లు జీవితాలను చిగురింప చేయ గలదు. మానవులు ఆశాజీవులు.


శరీరములో గల వ్యాధి శరీరమును నశింపజేయును. కానీ మనో మాలిన్యము తనతో బాటు సమాజమును నశింప చేయును.


జీవితము నిరాడంబరముగాను , మాలిన్య రహితముగాను యుండవలయును.


అందున తనకు పట్టింపు లేకుండయు యుండవలయును.


ఈర్ష్యాద్వేషాలు మాని అందరి వద్ద వ్యవహరించుము. కానీ ఆత్మానంద మును పొందుటకు మనస్సును అంతర్ముఖముగా పయనింప చేయుము.


అలలు , సమయము ఎవ్వరి కొరకు వేచి వుండవు.


గతమును గూర్చి బాధపడుచూ కాలం వృథాచేయువాడు మూర్ఖుడు. అట్టివానికి ఎందులోను నివృత్తి యుండదు.


ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించుకుంటూ వుంటే హక్కులు పొందుటకు అర్హులవుతారు.


సద్విమర్శ బాగుపడడానికి తోడ్పడుతుంది. అతి పొగడ్త చెరుపుకు దారితీస్తుంది.


ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులవల్ల సమాజానికి చెడు కలుగుతుంది.


ప్రతికూలమైన వాతావరణంలో కూడా క్రమశిక్షణకు కట్టుబడగలిగి వుండాలి.


దుర్బలుల బాధల అనుభవం నిజాయితీకి ఒరిపిడి రాయి.


అహింస సద్గుణం లాంటిది. హింస అసమర్థత లాంటిది.


ఆదర్శాలు ఆచరణయోగ్యమై వుండాలి.


సమాజంలో సోమరిపోతులైనవారు దొంగలతో సమానం


నీతిలేని వాణిజ్యం , కృషిలేని సంపద , శీలంలేని విద్య , త్యాగంలేని ఆరాధన , మానవతలేని శాస్త్ర విజ్ఞానం , నియమనిష్టలు లేని రాజకీయం ఇవి సామాజిక దురాచారాలు.


సమాజం వ్యక్తి ప్రయోజనానికి కాదు. సమాజ ప్రయోజనం కోసమే వ్యక్తి. 


నీవు నీకోసం జీవిస్తే నీతోనే నిలిచిపోతావు. నీవు జనం కోసం జీవిస్తే జనంలో నిల్చిపోతారు.


పేదరికం , జీవితపోరాటం - ఇవి సాధకునికి మంచిస్నేహితులు.


అపనిందలను ఒక చెవితో విని రెండవ చెవితో వదిలెయ్యాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat