ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయ రథాల సన్ డయల్ ద్వారా సమయాన్ని లెక్కించు విధానం.....*⏰

P Madhav Kumar

via YouTube https://youtu.be/lqo3JzYGo5Y


*అలా కాలాన్ని లెక్కించాం..*

*ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయ రథాల సన్ డయల్ ద్వారా సమయాన్ని లెక్కించు విధానం.....*⏰


ఆంగ్లేయుల ఏలుబడి నుంచి 1947 లో స్వాతంత్య్రం పొందింది. వారి పాలనా కాలంలోనే మనదేశానికి అభివృద్ధి తెలిసొచ్చింది. అంతెందుకు.. మనదేశానికి రూపురేఖలు కూడా బ్రిటీషర్లే ఇచ్చారనే వితండవాదాలు చాలానే ఉన్నాయి. 

కానీ అంతకుమించి, మరేదేశానికి లేనిది మనదేశానికి మాత్రమే సొంతమైన చరిత్ర మనకు ఉంది. దానికి సరైన ప్రాచుర్యం ఇవ్వలేక.. మన చదువుల్లో స్థానం కల్పించలేక.. మనకే తెలియని ఎన్నో విషయాలు మరుగున పడిపోతున్నాయి. 

అందులో ఒకటి.. ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం. ఈ ఒక్క ఆలయం గురించి తెలుసుకుంటే చాలు.. మన పూర్వీకుల విజ్ఞాన సౌరభం ఏ పాటిదో తెలుస్తుంది. మన ఋషులు.. ఖగోల జ్ఞానానికి ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారో తెలిసొస్తుంది. అంతెందుకు.. మొన్నటి చంద్రయాన్-3 ఎందుకని అడిగిన నోళ్లకు.. సమాధానం కూడా ఇచ్చినట్లవుతుంది. ప్రపంచస్థాయి సదస్సుల్లో అత్యంత కొనియాడదగింది.. జీ-20 సమ్మిట్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సదస్సును చేపట్టేందుకు అవకాశం దక్కడం.. గొప్ప విషయం. అందుకే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 

ఈ సందర్భంగా మన చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింభించేలా.. అలనాటి ప్రతిరూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా.. అక్కడ అందరినీ ఆకర్షించింది.. కోణార్క్ సూర్యదేవాలయంలోని చక్రం. వివిధ దేశాల నుంచి వస్తున్న అతిరథ మహారథులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా భారత్ మండపంలోకి ఆహ్వానించారు. ఆయన నిలబడ్డ వేదిక వెనుక.. ఈ చక్రం కనిపించింది. దాని గురించి ఆయా దేశాధినేతలకు ప్రధాని మోడీ వివరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా.. ఆ చక్రం రహస్యాలను విడమర్చి చెప్పారు. దీంతో ప్రస్తుతం కోణార్క్ సూర్యదేవాలయంలోని చక్రం గురించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించబడిన కోణార్క్ సూర్యదేవాలయం అద్భుతమైన ప్రాచీన జ్ఞానానికి ప్రతీక. ఆలయం మొదట్లో మొత్తం 12 జతలు అంటే 24 చక్రాలు నిర్మించారు. మొత్తం చక్రాల పరిమాణం, నిర్మాణం.. ఒకేరకంగా ఉంటాయి. ఈ చక్రాలపై ఏడు గుర్రాలతో కూడిన రథాన్ని నిర్మించారు. ఈ చక్రం.. భారతదేశ ప్రాచీన జ్ఞానం, నాగరికత, వాస్తుశిల్పం ఔన్నత్యానికి చిహ్నం. కోణార్క్ చక్రం యొక్క భ్రమణం.. కాలచక్రంతో పాటు పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. చక్రం యొక్క పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు. ప్రతి చక్రం 8 పెద్ద చువ్వలు, 8 సన్నటి చువ్వలు కలిగి ఉంటుంది. ఈ 24 చక్రాలలో 6 ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉండగా.. 4 చక్రాలు నాలుగువైపులా కనిపిస్తాయి. తూర్పు ముందు భాగంలో ఉన్న మెట్లకు ఇరువైపులా.. 2 చక్రాలున్నాయి. అసలు ఈ ఆలయం యొక్క ఆకర్షణే.. 

ఈ చక్రాలు. ఇవి సూర్యుడి రథచక్రాలకు ప్రతిరూపాలుగా సూచిస్తాయి. ఇక ఈ చక్రంలోని 8 పెద్ద చువ్వలు.. మూడు గంటల వ్యవధిని సూచిస్తాయి. దీన్ని ఉపయోగించి, సూర్యుని స్థానం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారు. ఏడు గుర్రాలు.. వారంలోని ఏడు రోజులుగా లెక్కించగా.. 12 జతల చక్రాలు సంవత్సరంలోని.. 12 నెలలను, 12 రాశులను సూచిస్తాయి. అలాగే మొత్తం 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. ఈ చక్రం ద్వారా సమయాన్ని ఎలా లెక్కించవచ్చో.. ఇప్పటికీ చూపించే గైడ్ లు ఆ ఆలయంలో ఉంటారు. 

24 చక్రాలలో 2 చక్రాలు.. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఖచ్చితమైన సమయాన్ని చూపుతాయి. చక్రం మధ్యలోని ఆక్సెల్ లో వేలు పెట్టి.. దాని నీడ ఆధారంగా సమయాన్ని కచ్చితత్వంతో చూపిస్తారు. కొణార్క్ చక్రం బౌద్ధుల ధర్మచక్రానికి సమానమని కూడా కొందరు విశ్వసిస్తారు. అంతేకాదు.. ఈ చక్రాలు మనిషి యొక్క 'జీవన చక్రం' గా వ్యాఖ్యానించబడ్డాయి. అవి సృష్టి, స్థితి, లయ యొక్క చక్రాన్ని చిత్రీకరిస్తాయి. 

ఇలా ప్రకృతిలోని ప్రతి అంశాన్ని మన శరీరానికి అన్వయం చేసి.. మన పూర్వీకులు ఎన్నో గొప్ప రహస్యాలను మనకు అందజేశారు. ఖగోల జ్ఞానాన్ని అత్యున్నతమైన విజ్ఞానంగా భావించారు కాబట్టే.. వాటి నుంచి ఆ కాలంలోనే పరిశోధనలు చేశారు.
🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat