కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2024 మే 15: చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ గ‌జేంద్ర‌ పాల్గొన్నారు.

మే 16న ధ్వజారోహణం :

మే 16వ తేదీ గురువారం ఉదయం 9 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూప‌రింటెండెంట్ శ్రీ చంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ గజేంద్ర పాల్గొన్నారు.

ప్ర‌తి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ

16-05-2024

ఉదయం – ధ్వజారోహణం(మిథున‌ లగ్నం)

సాయంత్రం – శేష వాహనం

17-05-2024

ఉదయం – తిరుచ్చిఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

18-05-2024

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

19-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

20-05-2024

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

21-05-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

22-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

23-05-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

24-05-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/ehYjJlH
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(50)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!