_* ఆశా దశమి*_

P Madhav Kumar


🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఈ రోజు అభీష్ట సిద్ధికై   ఆశా దశమి* ఇలా చేయడం వలన వంశం అభివృద్ధిలోకి వస్తుంది. పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఉద్యోగం లేని వారు , సంతానం లేని వారు , ఉద్యోగం కోల్పయిన వారు , అప్పులపాలైన వారు , పిల్లలు సరిగ్గా చదవడం లేదనీ , చెడు ప్రవర్తన కలిగి ఉన్నారనీ బాధ పడేవారు , పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నవారు , ఆరోగ్యం బాగులేనివారు మీమీ కోరికలను ఈశ్వరుడికి చెప్పుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి.


శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి అత్యంత ఫలప్రదమైనది. దీనిని *ఆశాదశమి లేదా కామికాదశమి* అంటారు. ఈ రోజున పరమేశ్వరునికి చందనోదకంతో ( చందనం కలిపిన నీళ్ళుతో ) అభిషేకం చేస్తే ఆశలు ఈడేరుతాయి అని శాస్త్ర వచనం. 


*ఆశ అంటే ఏమిటి ?* 


కోరికలనే ఆశలు అంటాము. మరి ఆ కోరిక ఎలాంటిదై ఉండాలి ? ధర్మబద్దమైన కోరిక అయి ఉండాలి. అతిగా ఆశించడమూ అత్యాశ , కొరకూడని దానిని ఆశించడమూ దురాశ అవుతాయి. నిజానికి మనము ఈశ్వరుడ్ని ఏదీ కోరవలసిన అవసరం ఉండదు , మనకు ఏమి కావాలో ఆయనకు తెలియదా ఆలోచించండి కానీ మనకు దుఃఖం కలిగినప్పుడు తల్లితో చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది , అలానే ఏదైనా కోరిక కలిగినప్పుడు అది తండ్రికి చెబితే ఆ కోరిక నెరవేరుతుంది. 


*జగతః పతరౌ వందే పార్వతీపరమేశ్వరౌ* అన్నారు అంటే ఈ జగత్తుకే తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు , వారి దగ్గరే మన కష్టాలు , కోరికలు చెప్పుకుంటాం. అవి తీర్చగల శక్తిసామర్ధ్యాలు ఉన్నవి వారికే కదా. కానీ వారు అవి ప్రసాదించే ముందు అవి మనకు యోగ్యమైనవేనా , అవి పొందేందుకు మనం ఇది వరకు పుణ్య కర్మలు చేసుకున్నామా అని చూసే ప్రసాదిస్తారు , పిండి కొద్దీ రొట్టె అన్నారు కదా. భగవంతుడిని ఎప్పుడూ ధర్మబద్దమైన కోరికలనే కోరాలి అంతే కానీ మరొకరికి హాని చేయమనీ , వినాశనం చేకూర్చమనీ కోరకూడదు. 


*కోరిక ఎలా నెరవేరుతుంది ?* 


కర్మ చేయకుండా ఏదీ జరుగదు. పుణ్యకర్మలు చేసినప్పుడు వాటి ఫలితంగా ధర్మబద్దమైన కోరికలను నెరవేరుస్తుంటాడు ఈశ్వరుడు.  ఆశా దశమి గురించి చెప్పకుండా ఈ ఉపోద్ఘాతమంతా దేనికి అనుకుంటున్నారా ... అక్కడికే వస్తున్నాను , ఒక కర్మ చేయడానికి మానసిక , వాచిక , కాయక కర్మలు చేయాలి. మానసికంగా ఈశ్వరుడ్ని మనసులో సుస్థిరంగా నిలుపుకుని ఉచ్చ్వాస నిశ్వాసల్లో ఆయనను స్మరిస్తూ ఉండాలి. వాచికంగా అంటే నోటి నుండీ వెలువడే మాటలు ఆయనను కీర్తించడానికి , ఆయనకు ప్రీతి కలిగించే మాటలే మాట్లాడుతూ ఉండాలి. ఇక కాయక అంటే దేహంతో చేయగల్గిన పనులన్నీ ఆయనని పూజించడం కోసం , ఆయనకు ప్రీతికరమైనవి చేయడం కోసమే చేస్తుండాలి. నిరంతరం ఇలా చేయడం మనకు చెప్పినంత సులభం కాదు నిజమే కానీ ప్రత్యేక పర్వదినాలలో అయినా ఇలా చేయగలిగితే అది అద్భుత ఫలితాలను ప్రసాదిస్తుంది.


*ఈ రోజు ఇలా చేయండి*


సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. 

అందరూ స్నానాదులు చేసుకుని శుచి అయ్యాక ఒక సాన రాయి , చేనదనపు చెక్కను తీసుకుని , పిల్లా పెద్దలందరూ తమ శక్తి మేరకు చందనం అరగదీయండి. అలా వచ్చిన చందనాన్ని నీటిలో కలిపి , ఆ నీటితో శివ లింగానికి అభిషేకం చేయండి. ఒకవేళ మీ ఇంట్లో శివ లింగము లేకపోతే మీకు దగ్గరలోని శివాలయంలో ఆ చెందనాన్ని అర్చక స్వాములకు ఇచ్చి అభిషేకం చేయమని చెప్పండి. గుడిలో అభిషేకం చేసే సమయం ముందు రోజు సాయంత్రమే తెలుసుకుని , అభిషేకం చేయడానికి ముందే మీరు తీసిన చందనం అందేలా చూసుకోండి. శివుని అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. తప్పకుండా మీ ధర్మబద్దమైన కోరికలు నెరవేరుస్తాడు. 


ఇది ఎంత సులభమైనదో ఆలోచించండి , చిన్న కార్యంతో గొప్ప ఫలితం పొందవచ్చు , కనుక వీలైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈరోజే చందనపు సాన , చందనపు చెక్క తెచ్చి సిద్ధంగా పెట్టుకోండి. ఇలా చేయడం వలన వంశం అభివృద్ధిలోకి వస్తుంది. పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఉద్యోగం లేని వారు , సంతానం లేని వారు , ఉద్యోగం కోల్పయిన వారు , అప్పులపాలైన వారు , పిల్లలు సరిగ్గా చదవడం లేదనీ , చెడు ప్రవర్తన కలిగి ఉన్నారనీ బాధ పడేవారు , పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నవారు , ఆరోగ్యం బాగులేనివారు మీమీ కోరికలను ఈశ్వరుడికి చెప్పుకుని స్వయంగా చందనం అరగదీసి అభిషేకం చేయండి లేదా అభిషేకం కోసం ఆలయంలో ఇవ్వండి. ఎవరికి వారే తమ స్వహస్తాలతో చేయాలి. మంచం పట్టిన వారు , ఆరోగ్యం సహకరించక చందనం తీయలేని వారు మాత్రం కనీసం ఆ చందనం తాకి భక్తితో ఆలయంలో అందేలా చూస్కోండి. అందరు ఈ అవకశాన్ని సద్వినియోగపరచుకోండి.


*మరొక ముఖ్య గమనిక*    చందనం బిళ్ళలు బయటవి కొని నీటిలో కలిపి అభిషేకం చేయకూడదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat