శ్రీ వేంకటేశ్వర లీలలు - భాగము 30

P Madhav Kumar


🌻 *శృంగారవనమున శ్రీనివాసుడు పద్మావతిని చూచి ఆమెను వరించుట* 🌻


🍃🌹పద్మావతి తన యిష్టసఖులను వెంటబెట్టుకొని శృంగారవనమునకు విహారమునకై వెళ్ళినది. అందమయిన అనేకానేక రకాల మొక్కలు, వివిధ నామాలతో విలసిల్లే పుష్పాలూ వుండీ ఆ శృంగారవనము శాభాయమానముగా వుంది. చెలులు తోటపని చేసేవారు. 


🍃🌹ఆ తరువాత కొలనులో చల్ల చల్లని నీటిలో జలకాలాడారు. ఆ తరువాత మధుర ఫలాలు భక్షించారు. ఆనందముగా సంగీతయుక్తముగా పాటలు పాడుకోవడము ప్రారంభించారు.


🍃🌹దాహముతో నున్న శ్రీనివాసుడు అదే ఉద్యానవనములో గల కొలనులో నీరు త్రాగి, దాహము తీర్చుకొని ఒక వృక్షచ్చాయకు వెడలినాడు. అప్పుడతనికి పద్మావతి చెలికత్తెలు చేస్తున్న గానము వినబడింది. ఆ గానం వింటూ శ్రీనివాసుడు ఆ పాటలు పాడుతున్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. పాట వచ్చేవైపే వెళ్ళినాడు. పద్మావతిని, చెలికత్తెలను చూశాడు, వారూ శ్రీనివాసుని చూశారు.


🍃🌹పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసు డాశ్చర్యపోయినాడు. ఆహా! ఈ కన్య రతిని, పార్వతిని, భారతిని, శ్రీసతిని తలదన్నునంత అందముగ న్నుదే! ఈ వనితపొందు పొందనిచో నా యీ జన్మమేల? ఈమె పాదాలు చూడబోతే చిగురుటాకుల్ని మించి వున్నాయి. 


🍃🌹ఈమె నడుము చూస్తే లేదనిపించే నడుము. ఈమె వక్షోజాలు చేస్తే జక్కువపిట్టలకన్నా బాగున్నాయి. చేతులు కమలాల సుకుమారాన్ని కాదనేలా ఉన్నాయి. శంఖములాగా ఉన్నది కంఠము. అధరము దొండపండులాగా ఉన్నది. 


🍃🌹మల్లె మొగ్గలను మించిన తెల్లదనముతో పలువరుస వున్నది. నువ్వుపువ్వును నీలెక్కే మిటనగల సొగసుతనము గల ముక్కు ఈమె కున్నది. శ్రీకారములను మించిన చెవులు కలిగి యున్నదీ వనిత. ఆమె కన్నులా హృదయగతానం దావిష్కారణ దర్పణములై నిర్మలములై ఉన్నవి. 


🍃🌹ఈమె తీయని మాటలు వీణియమీటల మధురస్వరములను మించి ఉన్నవి’ అని పద్మావతి సౌందర్యాన్ని పదేపదే వర్ణించుకున్నాడు. అసలు ఈమె వివాహితయో? అవివాహితయో? కూడా తెలుసుకొనవలసి వున్నది, సరే ఆమెనే అడిగెదను గాక అనుకొని పద్మావతినీ సమీపించబోయెను. 


🍃🌹పద్మావతి తన చెంతకు వచ్చుచున్న వేటగానిని చూచి బెదిరి చెలులతో ‘‘మీరు వెడలి ఆ వచ్చుచున్న పురుషులెవరో సంగతీ సందర్భము తెలుసుకొనిరండి’’ అని పంపించినది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat