మనోహరం మహావరం అయ్యప్ప స్వామి చరితము,
మరలరాదు మనకురాదు మరో ఈ జన్మము, మరో ఈ జన్మము (మనోహరం)
స్వామియే శరణమని స్వామి మాల వేయగా (2)
వేసిన తనువు పండగా, వేయని తనువు దండగా (మనోహరం)
స్వామియే శరణమని శరణు ఘోష చెప్పగా (2)
చెప్పిన నోరు పండగా, చెప్పని నోరు దండగా (మనోహరం)
స్వామియే శరణమని చేతులెత్తి మొక్కగా (2)
మొక్కిన చేతులు పండగా, మొక్కని చేతులు దండగా (మనోహరం)
స్వామియే శరణమని స్వామి పూజ చేయగా (2)
చేసిన ఇల్లు పండగా, చేయని ఇల్లు దండగా (మనోహరం)
స్వామియే శరణమని చెవులారా వినగా (2)
విన్న చెవులు పండగా, వినని చెవులు దండగా (మనోహరం)
స్వామియే శరణమని శబరీ కొండలెక్కగా (2)
ఎక్కిన పాదము పండగా, ఎక్కని పాదము దండగా (మనోహరం)
స్వామియే శరణమని పంబా స్నానము చేయగా (2)
చేసిన తనవు పండగా, చేయని తనవు దండగా (మనోహరం)
స్వామియే శరణమని మకర జ్యోతి చూడగా (2)
చుసిన కనులు పండగా, చూడని కనులు దండగా (మనోహరం)
స్వామియే శరణమని స్వామి దీక్ష బూనగా (2)
అదే అదే మోక్షము, ఇదే ఇదే పుణ్యము (మనోహరం)