శబరిమల తపస్వి శ్రీ శ్రీ శ్రీ విమోచననంద స్వామి

P Madhav Kumar



 ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారిని పరిచయం చేసిన తొలి వ్యక్తి శ్రీవిమోచననందస్వామి 

 వారిని స్మరిస్తూ ఆ మహానుభావుని చరిత్ర తెలుసుకుందాం


 కొందరు మహనీయులు భగవంతుని అవతార స్వరూపాల్లో ఒక రూపాన్ని విశ్వసించి ఆ స్వామికి తన జీవితం అంకితం చేస్తారు తాను నమ్మిన స్వామివారి ఖ్యాతిని మహిమల్ని లోకానికి చాటి వారి సేవ లోనే చరితార్థులు అవుతారు

 అటువంటి గొప్ప భక్తులు అయ్యప్ప స్వామివారి సేవకు తన జీవితం అంకితం చేసిన త్యాగధనుడు శ్రీ విమోచనా నంద స్వామి ఆ భక్తుని జీవిత చరిత్ర లోని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.


 శ్రీ విమోచన నంద స్వామి వారి అసలు పేరు గోవిందన్ అది వారి తాత గారి పేరు కానీ అందరూ ఆయనను చిన్నతనంలో ముద్దుగా తంగప్పన్  అని పిలిచేవారు ఆయన కేరళ రాష్ట్రం రాజధాని త్రివేండ్రంలో 1908 ఆగస్టు 19 వ తేదీన శ్రీమతి పొన్నమ్మ శ్రీకృష్ణ పిళ్లేలకు జన్మించినారు తల్లి పున్నమ్మ కు సంగీతంలో ప్రావీణ్యం ఉండటంతో స్వామీజీ చిన్నతనంలోనే భజన గీతాలు పాడడం అలవడింది ఆయన తొమ్మిదో ఏట తల్లి మరణించింది స్వామీజీ ఉన్నత విద్య కోసం త్రివేండ్రంలోని కళాశాలలో చేరారు ఆయనకు ఆ రోజుల్లో రామకృష్ణపరమహంస వివేకానందుడే ఆదర్శం స్వామీజీ వివాహం చేసుకుని రెవెన్యూ శాఖలో ఉద్యోగం లో చేరారు అప్పుడు ఆయన రాముడు కృష్ణుని కొలిచేవారు ఆసమయంలో స్వామీజీ మొట్టమొదటిసారి శబరిమల యాత్ర చేశారు అప్పుడు అయ్యప్పస్వామి లో ఆయన శ్రీరామచంద్రుని శ్రీకృష్ణుని చూసిన అనుభూతిని చెందారు ఆ అయ్యప్పను చూసిన ముహూర్తబలం ఎటువంటిదో గాని స్వామి అయ్యప్ప స్వామివారి శరణ దాసులయ్యారు శబరియాత్ర కు వచ్చే భక్తులు స్వచ్ఛందంగా సేవ చేసేవారు స్వామీజీ కి  నలుగురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు తన పిల్లలను మూడో సంవత్సరం రాగానే తన వెంట శబరి యాత్రకు తీసుకువెళ్ళి దర్శనం చేయించేవారు


 శబరిమల ఆలయం తెరిచి నప్పుడల్లా స్వామీజీ ఆఫీసుకు సెలవు పెట్టి శబరి గిరి కి పోయేవారు అక్కడ భక్తులకు తమ సేవలు అందించేవారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అయ్యప్ప స్వామి విగ్రహం ముందు కూర్చుని ధ్యానం తో మునిగిపోయేవారు స్వామీజీ తిరువాన్కుర్ ప్రాంతం చావర అనే ఊళ్ల ఫుడ్ గ్రెయిన్ డిపో అధికారిగా ఉండగా ట్రెజరీ అకౌంటెంట్ గా పదోన్నతి పొంది మాచెలికర్తే అనే ఊరు కు బదిలీ అయ్యారు కానీ 1949వ సంవత్సరం జూలై 14వ తేదీన స్వామీజీ  బంధుమిత్రులనీ భార్యా పిల్లలను వదిలి రెండు జతల బట్టలు 6రూపాయలతో ఇల్లు వదిలి వేశారు ఉద్యోగం వదిలేశారు శబరిమల సన్నిధానం చేరారు

 అప్పుడు  మాస  పూజల నిమిత్తం వచ్చిన ఆలయ అర్చక బృందం కొందరు భక్తులు ఐదు రోజులు సన్నిధానంలో పూజలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు శబరిమల దేవాలయం ప్రధాన పూజారి శ్రీ కృష్ణన్ నంబూద్రి విద్వాన్ స్వామీజీని తమతో రమ్మని కోరగా ఆయన నిరాకరించారు వాళ్ళు ఆయనను వదిలి వెళ్ళిపోగా శ్రీ మాధవన్ స్వామి అనే భక్తుడు మాత్రం స్వామీజీకి తోడుగా ఉండి పోయారు అప్పుడు ఇద్దరు అయ్యప్ప స్వామి గురించి తపస్సు చేశారు దేవాలయ పూజారి బృందం వదిలివెళ్లిన బియ్యం సరుకులతో కొన్ని రోజులు వంట చేసుకుని తిని తర్వాత అడవిలో దుంపలు ఆకులు తిని గడిపారు అలా నెల రోజులు గడిచాయి నెల రోజుల తర్వాత తిరిగి వచ్చిన అర్చకులు స్వామీజీ మాధవన్ ఇంకా సన్నిధానంలో ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయారు తిరిగి వాళ్ళు వెళ్లేటప్పుడు ఇద్దర్ని తమతో రమ్మని బతిమాలారు వారితో మాధవన్ వెళ్లిపోయిన స్వామి అక్కడే ఉండిపోయారు స్వామీజీ మరొక నెల రోజుల పాటు సన్నిధానం లోనే  తపస్సుచేసి అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రులయ్యారు 1949 వ సంవత్సరం తాను సన్యాసం స్వీకరించిన్నట్లు సన్నిధానం మేల్ శాంతి గారికి తెలిపారు అలాగే తనను విమోచనా నంద.స్వామి గా పేరు మార్చుకోమని అయ్యప్ప స్వామివారి ఆదేశించారని చెప్పారు అక్కడున్న వారు ఆ మాటలు నమ్మకపోవడం తో అక్కడున్న 20 మందితో 20 చిట్టీలు ఖాళీగా ఉంచి ఒక్క చిట్టిలో విమోచనానంద స్వామి అన్న పేరు రాసి అయ్యప్ప స్వామి పాదాల ముందు ఉంచమని చెప్పారు తర్వాత అయ్యప్ప స్వామి పూజ చేసి అక్కడున్న వారిలో ఎవరైనా ఒక చిట్టి తియ్యమని అడిగాడు ఆ ఒక్క చిట్టి లో విమోచనా నంద స్వామి అనే పేరు వస్తే నా మాటలు నమ్మండి అని చెప్పారు


 అప్పుడు శబరిమల దేవస్థానం అకౌంటెంట్ కోచ్ రామన్ పిల్లే అనే ఆయన ఒక చిట్టి తీశాడు ఆశ్చర్యకరంగా అందులో విమోచనా నంద స్వామి పేరు కనిపించింది స్వామీజీ ఆనంద పరవశం అయ్యారు అప్పుడు స్వామీజీ కోరిక మేరకు మేల్ శాంతి పూజ చేసి కాషాయ వస్త్రాలు ఆయనకు ఇచ్చారు ఆనాటి నుంచి ఆయన తంగప్పన్ విమోచనా నంద స్వామి గా మారారు


 ఆ తర్వాత అర్చకస్వాములు వెళ్లిపోయిన స్వామీజీ ఒక్కరే శబరిమలలో ఉండిపోయారు స్వామీజీ ఏకాంతంగా సన్నిధానంలో తపస్సు చేసుకుంటుండగా పులులు, సింహాలు వంటి జంతువులు సర్పాలు ఆయన రూపాన్ని చూసి వెళ్లేవారట. ఆయన స్వయంగా రచించి పాడే భక్తి గీతాలు విన్న మేల్ శాంతి ఆ గీతాలను స్తుతిమాల అన్న పేరుతో అచ్చు వేయించారు స్వామీజీ సన్నిధానంలో తపస్సు చేస్తుండగా 1950వ సంవత్సరం జనవరి నెల 12వ తేదీ తెల్లవారుజామున అయ్యప్ప స్వామి సాక్షాత్కరించి స్వామీజీని దేశాటన చేసి తన చరిత్ర ను చాటమని ఆదేశించారట తర్వాత మకరసంక్రాంతి ఉత్సవాలు ముగిసిన తరువాత స్వామీజీ సన్నిధానం విడిచి మొదట కొట్టాయం చేశారు అక్కడ నుండి గురువాయూరు వెళ్లి గురువాయురప్ప ను దర్శించారు తర్వాత దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు దర్శించారు మార్గంలో ఆయన ఎవరి దగ్గర ధనాన్ని తీసుకోకుండా బిక్ష మాత్రం స్వీకరించేవారు భక్తులు కొందరు ఆయనకు టికెట్ కొంటే దానితో కేరళ కర్ణాటక మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రాలు సందర్శించారు తర్వాత స్వామీజీ కాశీ పట్టణం చేరారు

 కాశీ పట్టణంలో నాయర్ అని మలయాళీ స్వామీజీకి అభిమానిగా మారడంతో స్వామీజీ అతని సహకారంతో తిలబందేశ్వర్ మఠములో ఉండడానికి అవకాశం లభించింది అక్కడ స్వామీజీకి తిలబందేశ్వర్ మఠాధిపతి శ్రీ అచ్యుతానందగిరి మహారాజుతో సన్నిహిత్యం ఏర్పడింది ఒక నాడు స్వామీజీ కాశీ పట్టణంలో అయ్యప్ప స్వామి వారి దేవాలయం నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది వెంటనే తన మిత్రుడైన నాయర్ తో సంప్రదించారు కాశీలో ఆలయ నిర్మాణానికి స్థలం సేకరించడం చాలా కష్టమని అందరు చెప్పారు కానీ స్వామీజీ తన ఆలోచనను మతాధిపతి కి తెలియజేశారు అయ్యప్ప స్వామి వారు అనుగ్రహించారు మఠాధిపతి కాశీలోని తన మఠంలోని ఒక పక్క అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి స్థలం కేటాయించడానికి ఒప్పుకున్నారు ఉత్తర భారతదేశంలో అందునా కాశీలో మొదట అయ్యప్ప స్వామి వారి దేవాలయం నిర్మించింది శ్రీ విమోచననంద స్వామీజీ


 మఠాధిపతి దేవాలయానికి స్థలం కేటాయించగానే స్వామీజీ అయ్యప్ప వారి చిత్రపటం తెప్పించి 1950వ సంవత్సరంలో మార్చిలో ఆలయ శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఆలయ నిర్మాణ కమిటీ ని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి మఠాధిపతి అచ్యుతానందగిరి మహారాజ్ అధ్యక్షుడిగా తన మిత్రుడు నాయర్ కార్యదర్శిగా నియమితులయ్యారు ఆలయ నిర్మాణం త్వరత్వరగా పూర్తి చేయమని కోరి స్వామీజీ కాశీ నుండి హిమాలయాల్లో ఉన్న గంగోత్రి కి ప్రయాణమయ్యారు గంగోత్రి లో స్వామీజీ అయ్యప్ప స్వామి వారి భజన గీతాలు ఆలపించి అక్కడ వారికి వినిపించేవారు 


1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, విమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు.


 నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు.నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం. 


మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి అయ్యప్ప దేవాలయం గొల్లపూడి శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం విజయవాడ లో కలదు దీనిని కూడా స్వామి  విమోచన నంద స్వామి వారు నిర్మించినది.. 

అలాగే కోదాడలోని శ్రీ అయ్యప్ప దేవాలయం పాల్వంచలోని శ్రీ అయ్యప్ప దేవాలయం స్వామి విమోచనా నంద స్వామి వారి చేతుల మీదుగా దేవాలయాలు నిర్మించారు ఇంకనూ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దేవాలయాలు స్వామి విమోచన నంద వారి స్వహస్తాలతో నిర్మాణం జరిగినవి..

స్వామి శరణం  !!

గురుస్వామి దైవమే శరణం అయ్యప్ప !!


⚔️ కలియుగవరదన్ అయ్యప్ప  🏹


      ॐ  హరిహర  卐


హర్ హర్ మహాదేవ్.,జై శ్రీ రామ్


స్వామియే శరణం అయ్యప్ప


    ధర్మో రక్షతి రక్షితః


లోకా సమస్త సుఖినో భవంతు🙏


కలియుగవరదన్ అయ్యప్ప 🙏🚩

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat