ఇవ్వటం నేర్చుకో.. తీసుకోవటం కాదు,
సేవ చేయటం నేర్చుకో పెత్తనం చేయటం కాదు
గౌరవించటం నేర్చుకో గొప్పలు చెప్పడం కాదు
అనుకువ నేర్చుకో అహంకారం కాదు.....
అప్పుడే పిల్లలు నిన్ను గౌరవిస్తారు పెద్దలు నిన్ను ప్రేమిస్తారు జీవితంలో ఏవి నీ వెనుకరావు నువ్వు సంతోషంగతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించిన సంపద ఏది మనది కాదు ఒక్క మంచితనం , మనం చేసుకున్న పుణ్యం ఎదుటి వారి హృదయంలో ప్రేమ తప్ప. గత జన్మలో మనకి మన కర్మలకి సంబంధం ఉన్నవాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో వందల కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి మేధస్సుకు కూడా అంతు చిక్కని అంతరార్థం ఉంటుంది ఇది జీవిత సత్యం .ఖర్మ సిద్ధాంతం.. మన నుండి ఎవరైనా ఆత్మీయులు బంధువులు దూరమైనా ఎక్కువ బాధ పడకుండా ఖర్మ తీరింది అనుకోవటం మంచిది
అబద్దం ఎప్పుడూ మరికొన్ని అబద్దాల తోడు కోరుకుంటుంది ఎందు కంటే దానికి భయం ఎక్కువ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది ఎందుకంటే దానికి దైర్యం ఎక్కువ , ఎవరికి తలవంచనిది ఆత్మగౌరవం ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత ఈ మూడు కలిసిన జీవితం ఆదర్శం.
మీరు చేసిన మంచిని మనుషులు గుర్తించకపోవొచ్చు, కాని దైవం తప్పక గుర్తిస్తుంది, మంచికి మంచి చెడుకు చెడు తప్పక ఉంటుంది ప్రాణంతో ఉన్నప్పుడు పలకరింపు లేదు కాని ప్రాణం పోయిన తరువాత మాటలు ఎన్నో.. ఉపయోగం.. అందుకే తెగిపోయినప్పుడే తెలుస్తుంది బంధం విలువ కాని దారం విలువ కాని మన సంతోషం కోసం పది మంది ని బాధపెట్టడం కంటే, పది మంది సంతోషం కోసం మనం బాధపడటం ఉత్తమం..
జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ, మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికి క్షమించకూడదు....