భర్తకు ఏడమవైపునే భార్య ఉండాలి
దంపతులు పెళ్లి దగ్గర్నుంచి ప్రతి వేడుకలోనూ భార్యను భర్తకు ఎడమ వైపునే ఉండమని చెపుతుంటారు పెద్దలు.
ఇలా ఎందుకు అంటే .... మనిషికి హృదయం ఎడమవైపున ఉంటుంది కాబట్టి ఆ హృదయంలో స్థానం సంపాదించడానికి అక్కడే ఉండాలని పెద్దలు చెపుతారు. అయితే భార్య భర్తకి ఎడమవైపున నిలబడడం అనేది ఓ ఆలవాటు దగ్గర్నుంచి సంప్రదాయంగా మారింది.
పూర్వం రాజులు తమతో ఎప్పుడూ ఆయుధాలను ఉంచుకోనేవారు.అమ్ముల పోదిని వీపునకు కుడి వైపున తగిలించుకునేవారు.అటు పక్కన నిలబడితే పోరపాటున ఆ బాణాలు గుచ్చుకుంటాయేమోనని భార్యను ఎడమ పక్కన ఉంచుకునేవారు.అది కాస్తా తర్వాత సంప్రదాయంగా మారింది.భార్య అంటే భర్త ఆయుష్షు నింపే హృదయ దేవత .భార్య అంటే భర్తలో సగం, భార్య అంటే భర్త బాధ్యతలో సగం. ఇంటి క్షేమం కోరుకునేది భర్త అయితే భర్త క్షేమం కోరుకునేది భార్య. అందుకే భర్త ఆయుష్షు హృదయం కనుక ఆ హృదయానికి ఆయుష్షు నింపే భార్య ,భర్త హృదయం వైపునే ఉండాలని పెద్దలు చెపుతారు..సేకరణ..