....ద్వాదశ జ్యోతిర్లింగాలు

P Madhav Kumar


                     

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।        

ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥

పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।     

సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥

వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।   హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥                    ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః । 

సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥                                              


పైశ్లోకము ప్రతిరోజూ ఉదయము సాయంత్రం పఠించినవారి జన్మజన్మపాపములు నశించునని చెప్పబడినది. కావున పవిత్ర శివనామస్మరణ చేసి దేవదేవుని కృపకు పాత్రులుకండి. 

                                                                                                                     లింగరూపంలో శివుని ఆవిర్భావ కధనం శివపురాణం ప్రకారం విష్ణువు మరియు బ్రహ్మ ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించడం ఆలయంలోని ఒక శిల్పంపై అద్భుతంగా చెక్కబడింది. శివుడు, ఇక్కడ లింగంగా మలచ బడ్డాడు. పురాణాల ప్రకారం, విష్ణువు మరియు బ్రహ్మల మధ్య జరిగిన ప్రాథమిక యుద్ధంలో శివుడు జ్వాల లేదా కాంతి స్తంభంగా కనిపించి వారిమధ్య ఆధిపత్యాన్ని నిర్ణయించడానికి తన మూలాన్ని కనుగొనమని చెప్పాడు. వారు ఇరువురిలో విష్ణువు శివుని పాదాల స్థాయిలో  మూలం తెలుసు కొడానికి తాబేలు రూపం లోనూ; బ్రహ్మ శివుని పైభాగాన్ని తెలుసు కునేందుకు  హంస రూపంలో వెళ్లారు. బ్రహ్మ మరియు విష్ణువు తమ అన్వేషణలలో విఫలమై శివుని వద్దకు తిరిగివచ్చారు. విష్ణువు శివుని పాదాలను కనుగొనలేకపోయాడని తెలిపి అహంకారానికి చింతించాడు. బ్రహ్మ తాను అగ్రభాగం చూశానని, దానికి రుజువుగా తనకు కేతకి (మొగలి) పుష్పం సాక్షంగా లభించినట్లు తెలిపాడు. పరమశివుడు తనకు తాను అనంతుడని మరియు తన ఉనికి యొక్క మూలాలు తెలియవని పేర్కొన్నాడు, భూమిపై బ్రహ్మకు ఆలయం ఉండదని మరియు కేతకి (మొగలీ) పువ్వును అతని పూజలో ఎప్పటికీ ఉపయోగించకూడదని శపించాడు. శివారాధనకు శివరాత్రి సమయంలో తప్ప మరియు ఇతరదేవతల ఆరాధనలో కేతకి పుష్పాలను ఉపయోగించడం నిషిద్ధం. శివలింగంయొక్క ఆవిర్భావ చరిత్ర వివరించే ఇటువంటిశిల్పం ఇతర ఆలయాలలో లేదు.


శివ క్షేత్రములు 64 అయిననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిపొందినవి. . ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రములు ఉత్తరాన్న కేదారేశ్వర్ నుండి దక్షణాన రామేశ్వరంవరకు మరియు తూర్పున వైధ్యానాధ్ నుండి పడమర సోమనాధ్ వరకు  వివిధ రాష్ట్రములలో శంఖు ఆకారంలో ఉంటాయి. కేదార్నాధ్ తప్ప పరమశివునికి సంబంధించిన ద్వాదశ  జ్యోతిర్లింగ క్షేత్రములలో లింగాకారంలో శివుడు దర్శనమిస్తాడు. కేదార్నాధ్ నందు మాత్రం నంది (వృషభం) మూపురం ఆకారంలో శివుడు దర్శనం ఇస్తాడు. ప్రతి జ్యోతిర్లింగం ప్రధాన దైవంపేరుతో వివిధ రూపములతో ఖ్యాతి పొందాయి.  

జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము మరియు ఈ జ్యోతిర్లింగములు దర్శించి సేవించుటవలన ఏఏ రాశులవార్కి జాతకదోష పరిహారమౌనో తెలియ పరచు చున్నాము.

1..సోమనాథ్ మేషం 

సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే 

జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్                 

భక్తప్రదానాయ కృపావతీర్ణం 

తం సోమనాథం శరణం ప్రపద్యే   

2. మల్లిఖార్జున  కన్య 

శ్రీశైలశృంగే వివిధప్రసంగే 

శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్                  

తమర్జునం మల్లికపూర్వమేనం 

నమామి సంసారసముద్రసేతుమ్      

3. మహాకాలేశ్వర్  తుల

అవంతికాయాం విహితావతారం 

ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్             

అకాలమృత్యోః పరిరక్షణార్థం 

వందే మహాకాలమహాసురేశమ్           

4. ఓంకారేశ్వర్  కర్కాటకం 

కావేరికానర్మదయోః పవిత్రే 

సమాగమే సజ్జనతారణాయ                 

సదైవ మాంధాతృపురే వసంతం

ఓంకారమీశం శివమేకమీడే            

5.   వైధ్యనాధ్ సింహం 

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే 

సదా వసం తం గిరిజాసమేతమ్                 

సురాసురారాధితపాదపద్మం 

శ్రీవైద్యనాథం తమహం నమామి         

6. భీమశంకర్ మకరం 

యం డాకినిశాకినికాసమాజే 

నిషేవ్యమాణం పిశితాశనైశ్చ                 

సదైవ భీమాదిపదప్రసిద్ధం 

తం శంకరం భక్తహితం నమామి            

7.   రామనాధేశ్వర్ మేషం 

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే 

నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః                    

శ్రీరామచంద్రేణ సమర్పితం 

తం రామేశ్వరాఖ్యం నియతం నమామి    

8. నాగనాధ్ మిధునం 

యామ్యే సదంగే నగరేఽతిరమ్యే 

విభూషితాంగం వివిధైశ్చ భోగైః                 

సద్భక్తిముక్తిప్రదమీశమేకం

శ్రీనాగనాథం శరణం ప్రపద్యే                

9.    కాశీవిశ్వనాధ్ ధనస్సు 

సానందమానందవనే వసంతం 

ఆనందకందం హతపాపబృందమ్               

వారాణసీనాథమనాథనాథం 

శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే              

18. త్రయంబకేశ్వర్ మీనం 

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం 

గోదావరితీరపవిత్రదేశే                               

యద్దర్శనాత్ పాతకం పాశు నాశం 

ప్రయాతితం త్ర్యంబకమీశమీడే   

11.    కేదారేశ్వర్   కుంభం 

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం 

సంపూజ్యమానం సతతం మునీంద్రైః          

సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః

కేదారమీశం శివమేకమీడే              

12.   ఘృశ్నేశ్వర్ వృశ్చికం     

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ 

సముల్లసంతం చ జగద్వరేణ్యమ్               

వందే మహోదారతరస్వభావం 

ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే       

                      

 జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |

 స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ 

ద్వాదశ జ్యోతిర్లింగములు అన్నియు కలిపిన శంఖు ఆకారం దర్శనం ఇస్తుంది. ద్వాదశాజ్యోతిర్లింగములు శంఖు ఆకారపు పొందిక గమనించిన 1.కేదార్నాధ్ (ఉత్తరాఖండ్) నుండి ప్రారంభించి 2. .భైధ్యనాధ్ (జార్ఖండ్), 3. రామేశ్వరం (తమిళనాడు), 4. సోమనాధ్ (గుజరాత్), 5. విశ్వేశ్వర్ (ఉత్తరప్రదేశ్)6. మల్లిఖార్జున (ఆంధ్ర ప్రదేశ్), 7. నాగేశ్వర్ (గుజరాత్), 8. మహాకాళేశ్వర్ (మధ్యప్రదేశ్),9. భీమశంకర్ (మహారాష్ట్ర),  10. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్), 11. త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర), 12. ఘృష్నేశ్వర్ (మహారాష్ట్ర) క్రమంలో ఉన్నవి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు ఒకేపర్యాయము దర్శించుటకు అవిఅన్నియు వేర్వేరు రాష్ట్రములలో వేర్వేరు శీతోష్ణస్థితిలో ఉండుటవలన ప్రయాసతో కూడినది. కావున రెండు లేదా మూడు జ్యోతిర్లింగములు ఒకపర్యాయము దర్శించుటకు వీలుగా వివిధ యాత్రలందు పొందు పరచబడినవి. ద్వాదశ జ్యోతిర్లింగములవలేనే అష్టాదశ శక్తిపీఠములు వేర్వేరు రాష్ట్రములలో ఉండుటవల్ల జ్యోతిర్లింగ దర్శనం చేసినప్పుడు అచటకల శక్తిపీఠములు దర్శించవచ్చును.                                                                                                                                                                       

 


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat