శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

P Madhav Kumar


శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం


1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ

మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా I

విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే

విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II

  

2. నజానామి శబ్దం నజానామి చార్థం

నజానామి పద్యం నజానామి గద్యం I

చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే

ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II


3. మయూరాధిరూఢం మహావాక్యగూఢం

మనోహారిదేహం మహచ్చిత్తగేహం I

మహీ దేవదేవం మహావేదభావం

మహాదేవబాలం భజే లోకపాలం II


4. యదా సన్నిధానం గతామానవామే

భవామ్భోధిపారం గతాస్తేతదైవ I

ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే

త మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II


5. యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః

తథైవాపదః సన్నిధౌ సేవతాంమే I

ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం

సదా భావయే హృత్సరోజే గుహంతం II


6. గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః

తదా పర్వతే రాజతే తేధిరూఢాః I

ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః

సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు II


7. మహామ్భోధితీరే మహాపాపచోరే

మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే I

గుహాయాం వసంతం స్వభాసాలసన్తం

జనార్తిం హరంతం శ్రయామో గుహంతం II


8. లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే

సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే I

సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం

సదాభావయే కార్తికేయం సురేశమ్ II


9. రణద్ధంసకే మంజులే త్యన్తశోణే

మనోహారి లావణ్య పీయూషపూర్ణే I

మనః షట్పదో మే భవక్లేశతప్తః

సదా మోదతాం స్కందతే పాదపద్మే II


10. సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం

క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ I

లసద్ధేమపట్టేన విద్యోతమానాం

కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్ I


11. పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ

స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్ I

నమస్యామ్యహం తారకారే! తవోరః

స్వభక్తావనే సర్వదా సానురాగమ్ II


12. విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్

నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్ I

హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్

సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్ II


13. సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః

సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్ I

సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః

తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్ II


14. స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్

కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని I

సుథాస్యంది బింబాధరాణీశ శూనో

తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి II


15. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్

దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు I

మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్

భవేత్తే దయాశీల కానామహానిః II


16. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా

జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్ I

జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః

కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః II


17. స్ఫురద్రత్న కేయూర హారాభిరామః

చల త్కుండల శ్రీలస ద్గండభాగః I

కటౌ పీతవాసాః కరే చారుశక్తిః

పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః II


18. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య

హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్ I

సముత్పత్య తాతం శ్రయంతం కుమారం

హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ II


19. కుమారేశసూనో! గుహస్కందసేనా

పతే శక్తిపాణే మయూరాధిరూఢ I

పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్

ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్ II


20. ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే

కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే I

ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం

ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్ II


21. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్

దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు I

మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్

పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం II


22. ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా

ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం I

నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే

నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా II


23. సహస్రాండ భోక్తాత్వయా శూరనామా

హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః I

మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం

నహంసి ప్రభో! కింకరోమి క్వయామి II


24. అహం సర్వదా దుఃఖభారావసన్నో

భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే I

భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం

మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ II


25. అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః

జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః I

పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం

విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే II


26. దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః

ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ I

కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం

గుహే సంతులీనా మమాశేషభావాః II


27. మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం

అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః I

నృణామంత్యజానామపి స్వార్ధదానే

గుహాద్దేవ మన్యం న జానే న జానే II


28. కలత్రం సుతాబంధువర్గః పశుర్వా

నరోవాథ నారీ గృహేయే మదీయాః I

యజంతో నమంతః స్తువంతో భవంతమ్

స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార II


29. మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః

తథా వ్యాధయో బాధకా యే మదంగే I

భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే

వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల II


30. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం

సహేతే న కిం దేవసేనాధినాథ I

అహం చాతిబాలో భవాన్ లోకతాతః

క్షమస్వాపరాధం సమస్తం మహేశ II


31. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం

నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః I

నమః సింధవే సింధు దేశాయ తుభ్యం

పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు II


32. జయానందభూమన్ జయాపారధామన్

జయామోఘకీర్తే జయానందమూర్తే I

జయాశేషసింధో జయాశేషబంధో

జయత్వం సదా ముక్తిదానేశసూనో II


33. భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః

పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య I

సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః

లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః II


#ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణమ్.


🕉️🌞🌍🌙🌟🚩


సదా బాలరూపాపి విఘ్నాద్రిహన్త్రీ – మహాదన్తివక్త్రాపి పంచాస్య మాన్యా |

విధీన్ద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః(1)


భావం:- ఎల్లప్పుడు బాల రూపమున నున్నను, విఘ్నపర్వతముల భేదించునదియు, గొప్ప గజముఖము గలదైనను పంచాస్యుని (సింహము – శివుడు) ఆదర పాత్రమును, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు వారిచే వెతుక దగినదియు గణేశుడను పేరు గల ఒకానొక మంగళరూపము నాకు సంపదను కలుగజేయు గాక!


నజానామి శబ్దం నజానామి చార్థం – నజానామి పద్యం నజానామి గద్యమ్ |

చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – ముఖా న్నిస్సర న్తే గిర శ్చాపి చిత్రమ్(2)


భావం:- నేను శబ్దము నెరుగను. అర్థము నెరుగను, పద్యము నెరుగను, గద్యము నెరుగను. ఆరు ముఖములు గల ఒకానొక చిద్రూపము నా హృదయమునందు ప్రకాశించుచున్నది. నోటినుండి చిత్రముగా మాటలు వెలువడుతున్నవి.


మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |

మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్(3)


భావం:- నెమలిని నధిష్టించి యున్నవాడును, వేదాంత మహావాక్యములలో నిగూఢముగా నున్నవాడును, మనోహరమైన దేహము గలవాడును, మహాత్ముల చిత్తమునందు నివసించువాడును, బ్రాహ్మణుల కారాధ్యుడును, వేదములచే ప్రతిపాద్యుడను, మహాదేవుని నందనుడును, లోకపాలకుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించుచున్నాను.


యదా సన్నిధానం గతా మానవా మే – భవామ్భోధి పారం గతా స్తే తదైవ |

ఇతి వ్యంజయ న్సిన్దుతీరే య ఆస్తే – త మీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్(4)


భావం:- “నా సాన్నిధ్యమును పొందిన వెంటనే మనుజులు సంసార సాగరమును దాటుదురు” అని సూచించుచు, సముద్ర తీరముననున్న పరాదేవత యొక్క పుత్రుడగు పవిత్రుడైన సుబ్రహ్మణ్యుని స్తుతింతును.


యథా బ్ధే స్తరంగా లయం యా న్తితుంగా – స్తథైవా పద స్సన్నిధౌ సేవతాం మే |

ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయన్తం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్(5)


భావం:- ఎగసిపడు సముద్ర తరంగములు (ఒడ్డున ఉన్న) నన్ను చేరి లయమగునట్లుగా నా సన్నిధానమున

సేవించు జనుల ఆపదలు నశించిపోవును” అని చెప్పుచున్నట్లుగా మానవులకు సముద్ర తరంగములను చూపుచున్న ఆ కార్తికేయుని నా హృదయపద్మము నందు సదా తలంతును.


గిరౌ మన్నివాసే నరా యే ధిరూఢా – స్తదా పర్వతే రాజతే తే ధిరూఢాః |

ఇతీవ బ్రువ న్గన్థశైలాధిరూఢ – స్సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు(6)


భావం:- “నా నివాసస్థానమగు పర్వతము నెక్కిన నరులుకైలాసము నధిష్టించ గలరు అని చెప్పుచున్న వాని వాలే గంధశైలము నధిష్టించియున్న ఆ షణ్ముఖ దేవుడు ఎల్లప్పుడూ నాకు సంతోషము కలిగించు గాక !


మహామ్భోధి తీరే మహాపాపచోరే – మునీన్ద్రానుకూలే సుగంధాఖ్య శైలే |

గుహాయాం వసన్తం స్వభాసా లసన్తం – జనార్తిం హరన్తం శ్రయామో గుహం తమ్(7)


భావం:- మహా సముద్రతీరమందున్నదీ, మహా పాపములు హరించునదీ, మునీంద్రులకు కావాసమును నగు గంధశైలమునందు, గుహయందు తన కాంతితో ప్రకాశించుచు నివసించుచున్నవాడను, జనుల బాధలను హరించు వాడను నాగు కుమారస్వామిని సేవింతుము.


లస త్స్వర్ణ గేహే నృణాం కామదోహే – సుమస్తోమ సంఛన్నమాణిక్య మంచే |

సముద్య త్సహస్రార్క తుల్యప్రకాశం – సదా భావయే కార్తికేయం సురేశమ్(8)


భావం:- మనుజుల కోరికల నొసంగు కనక భవనములనందు పుష్ప సముదాయముచే గప్పబడిన రత్న పీఠముచే ఉదయించుచున్న సహస్రాదిత్యులతో సాటి అయిన వెలుగు గల దేవత శ్రేష్ఠుడైన కుమారస్వామిని నిరంతరం తలంచెదను.


రణద్ధంసకే మంజులే త్యన్తశోణే – మనోహారి లావణ్య పీయూషపూర్ణే |

మనషట్పదో మే భవక్లేశ తప్తః – సదా మోదతాం స్కన్ద ! తే పాదపద్మే(9)


భావం:- ఓ కుమారస్వామీ! సంసారము నందలి కష్టములచే తపింప జేయబడిన నా మనస్సనెడి తుమ్మెద –

శబ్దించుచున్న అందెలతో మనోహరమై మిక్కిలి ఎఱ్ఱనిదీ , మనోహరమైన లావణ్యామృతముతో నిండియున్న నీ పాదపద్మమునందు నిరంతరము ఆనందించు గాక!


సువర్ణాభ దివ్యామ్బరై ర్భాసమానాం – క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ |

లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కన్ద ! తే దీప్యమానామ్(10)


భావం:- ఓ కుమారస్వామీ! బంగారము వంటి కాంతి గల దివ్య వస్త్రముల తోను, శబ్దించుచున్న చిరు గంటలు గల మొలనూలుతోను, ప్రకాశించు చున్న బంగారపు పట్టెతోను, ప్రకాశించుచున్న నీ యొక్క కటి ప్రదేశమును ధ్యానింతును.


పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ – స్తనాలింగనాసక్త కాశ్మీర రాగమ్ |

నమస్యా మ్యహం తారకారే! తవోర – స్వభక్తావనే సర్వదా సానురాగమ్(11)


భావం:- తారకాసురుని సంహారించిన సుబ్రహ్మణ్య దేవా ! పుళింద కన్య యగు వల్లీదేవి యొక్క ఉన్నతములైన రొమ్ముల యాలింగనముచే లగ్నమైన కుంకుమచే ఎఱ్ఱనైనదియు, నిజ భక్తుల రక్షణమున నెల్లప్పుడు ఆసక్తిగల నీ వక్షస్థలమును నమస్కరింతును.


విధౌ క్లృప్తదణ్డా న్స్వలీలా ధృతాణ్డా – న్నిర స్తేభశుండా న్ద్విషత్కాలదణ్డాన్ |

హతేన్ద్రారిషండాన్ జగత్రాణశౌండా – న్సదా తే ప్రచణ్డాన్ శ్రయే! బాహుదణ్డాన్(12)


భావం:- విధిని కూడా దందించునవీ, బ్రహ్మాండమును మ్రోయుచున్నవీ, ఏనుగుల తొండముల కంటే బలమైనవీ, శత్రువులకు యమదండములైనవీ, రాక్షసులను సంహరించునవీ, లోకములను రక్షించునవీ, ప్రచండములైనవీ, అయిన నీ బాహుదండములను నేను ఎల్లప్పుడూ ఆశ్రయించుచున్నాను.


సదా శారదా షణ్మృగాంకా యది స్యుః – సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమన్తాత్ |

సదా పూర్ణబిమ్భా: కళంకై శ్చ హీనా – స్తదా త్వన్ముఖానాం బ్రువే! స్కన్ద! సామ్యమ్(13)


భావం:- ఓ కుమారస్వామీ! చంద్రులు ఎల్లపుడును శరచ్చంద్రులు గాను, ఆరు సంఖ్యగలవారుగను, ఉదయించుచున్నవారుగను , పూర్ణబింబోపేతులుగను, కళంక శూన్యులుగను నుందురేని అపుడు నీ ముఖములతో పోలికను చెప్పుదును.


స్ఫురన్మందహాసై స్సహంసాని చంచ – త్కటాక్షావలీ భృఙ్గా సంఘోజ్జ్వలాని |

సుధాస్యన్ది బిమ్బాధరాణీశసూనో – తవాలోకయే! షణ్ముఖాంభోరుహాణి(14)


భావం:- ఓ శివ కుమారా! చిరునవ్వుల నెడి హంసలతోనూ , చంచలమైన కటాక్షముల (క్రీగంటిచూపులు) నెడి తుమ్మెదలతోనూ, అమృతము స్రవించు దొండపండువంటి పెదవులతో కల నీ ఆరు ముఖలనెడి పద్మములను దర్శింతును.


విశాలేషు కర్ణాన్తదీర్ఘే ష్వజస్రం – దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు |

మయీ షత్కటాక్ష స్సకృత్పాతిత శ్చే – ద్భవేత్తే దయాశీల! కానామ హానిః(15)


భావం:- దయాశీలుడా! విశాలములను, కర్ణాంత పర్యంత దీర్ఘములను నగు నీ యొక్క పన్నెండు నేత్రములు దయను వర్షించుచుడంగా , నీ మంద కటాక్షము నాపై నొక పర్యాయము ప్రసరింప జేసిదవేని నీకు హాని యేమి ?


సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా – జపన్మన్త్ర మీశో ముదా జిఘ్రతే యాన్ |

జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః(16)


భావం:- కుమారా! చిరంజీవ! అని ఆరు పర్యాయము లుచ్చరించి శివుడు ఆఘ్రూణించు ననియు, జగద్బారమును నిర్వహింప సమర్థములును, కిరీటములచే ప్రకాశించుచున్న నీ తలలకు ఓ జగన్నాథా! నమస్కారము.


స్ఫురద్రత్న కేయూర హారాభిరామ – శ్చల త్కుణ్డల శ్రీలస ద్గండభాగః |

కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః(17)


భావం:- కాంతివంతమైన రత్నకంకణములతో, హారములతో మనోహరమైనవాడును , చలించుచున్న కుండల కాంతిచే ప్రసరించు చెక్కిళ్ళు గలవాడును, నడుమున పీత వస్త్రము, హస్తమున చేతిలో మనోహరమగు శక్తి (ఆయుధము)యు గల శివనందనుడగు కుమారస్వామి నా ఎదుట ఉండుగాక!


ఇహా యాహి! వత్సేతి హస్తా న్ప్రసార్యా – హ్వయ త్యాదరా చ్ఛంకరే మాతు రంకాత్ |

సముత్పత్య తాతం శ్రయన్త౦ కుమారం – హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిమ్(18)


భావం:- బిడ్డా! ఇటు రమ్ము” అని చేతులను చాచి ఆదరముతో శంకరుడు పిలుచుచుండగా తల్లి ఒడినుండి దూకి తండ్రి నాశ్రయించి వానిచే కౌగలించు కొనబడిన శరీరము గల బాలసుబ్రహ్మణ్యమూర్తిని సేవింతును.


కుమారేశసూనో! గుహ! స్కన్ద! సేనా – పతే! శక్తిపాణే! మయూరాధిరూఢ |

పులిన్దాత్మజా కాన్త! భక్తార్తిహారిన్! – ప్రభో! తారకారే! సదా రక్ష! మాం త్వమ్(19)


భావం:- కుమారస్వామీ! ఈశ్వరపుత్రా! గుహా! స్కందా! దేవసేనాపతీ! శక్తి యను ఆయుధము హస్తమునందు గలవాడా! నెమలినెక్కినవాడా! వల్లీ నాథా! భక్తుల బాధలను తీర్చునట్టి ప్రభూ ! తారకాసురుని సంహారించిన సుబ్రహ్మణ్యా !

నీవు నన్నెప్పుడూ రక్షించుము.


ప్రశాన్తేన్ద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్క౦పి గాత్రే |

ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో! భవాగ్రే గుహ! త్వమ్(20)


భావం:- ఇంద్రియములు చేష్టలుడిగి, స్పృహ తప్పి, ముఖము కఫమును గ్రక్కుచుండ, శరీరము భయముచే కంపించుచుండ దిక్కులేక నేను ప్రాణ ప్రయాణమునకు సిద్ధుడనై యుండగా దయా స్వభావము గల కుమారస్వామీ! నీవు నా యెదుట నుందువు గాక !


కృతాన్తస్య దూతేషు చణ్డేషు కోపా – ద్దహ! చ్ఛిన్ది! భింద్ధీతి మాం తర్జయత్సు |

మయూరం సమారుహ్య మాభై రితిత్వం – పురః శక్తిపాణి ర్మమా యాహి! శీఘ్రమ్(21)


భావం:- భయంకరులైన యమదూతలు కోపముతో “కాల్చుము! భేదించుము” అని బెదిరించుచుండగా, శీఘ్రముగా నీవు నెమలి నెక్కి శక్తిని చేతగొని నా యెదుటకు రమ్ము !


ప్రణమ్యా సకృ త్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో! ప్రార్థయేఽనేకవారమ్ |

న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే! – నకార్యా న్తకాలే మనాగ ప్యుపేక్షా(22)


భావం:- కృపా సముద్రుడా! ప్రభో! అనేక పర్యాయములు నీ పాదములపై బడి నమస్కరించి బ్రతిమాలుకుని ప్రార్థించుచున్నాను. మరణము దరిజేరినప్పుడు నేను మాట్లాడలేను. ఓ కృపా సముద్రుడా! నా మరణ కాలమున నీవు కొంచెము కూడ ఉపేక్షించకుము!


సహస్రాణ్డభోక్తా త్వయా శూరనామా – హత స్తారక స్సి౦హవక్త్రశ్చ దైత్యః |

మమాన్తర్హృదిస్థం మనఃక్లేశ మేకం – నహంసి ప్రభో! కింకరోమి క్వ యామి?(23)


భావం:- ఓ ప్రభో! నీచే అనేక బ్రహ్మాండములను కబళించిన శూరుడను పేరు గల తారకుడు, సింహ ముఖుడు అను రాక్షసులు చంపబడిరి. నా హృదయమునందున్న మానసికబాధ నొక్క దానిని నీవేల నశింపజేయవు? ఏమి చేయుదును ? ఎచటకు పోయెదను ?


అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవా దీనబంధు స్త్వదన్యం న యాచే |

భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత! త్వమ్(24)


భావం:- పార్వతీ నందనా ! నేను ఎల్లప్పుడూ దుఃఖ భారముచే క్రుంగితిని, నీవు దీనబాంధవుడవు. నీకంటే ఇతరులను నేను ప్రార్థించను. నీ భక్తికి ఆటంకమైనదియు, ఎల్లప్పుడు బాధలతో నిండినదియు నగు నా మానసిక వ్యధను నీవు నశింపజేయుము.


అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహ – జ్వరోన్మాద గుల్మాది రోగా మహాన్త: |

పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే! ద్రవన్తే(25)


భావం:- ఓ తారకాసుర సంహారీ! స్మృతి తప్పుట, కుష్టు, క్షయ, మూల రోగము, ప్రమేహము, జ్వరము, చిత్త చాంచల్యము, గుల్మములు మొదలైన మహారోగములు, సమస్త పిశాచములు, నీ ఆలయములో లభించే పత్రవిభూతిని చూచిన క్షణకాలములో తొలగిపోవును.


దృశి స్కన్దమూర్తి శ్రుతౌ స్కన్దకీర్తి – ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |

కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సన్తు లీనా మమాశేషభావా(26)


భావం:- నా దృష్టి యందు కుమారస్వామి దివ్యమూర్తి, చెవులయందు స్కందుని కీర్తి, నోటియందు ఎల్లప్పుడూ పవిత్రమైన స్వామి చరిత్ర, చేతుల యందు ఆయన సేవ ఉన్నవై, శరీరము ఆయనకు దాసియై నా ఆలోచనలన్నీ ఆ గుహునియందు లీనమూలగుగాక.


మునీనా ముతాహో! నృణాం భక్తిభాజా – మభీష్టప్రదా! స్సన్తి సర్వత్ర దేవాః |

నృణా మన్త్యజానా మపి స్వార్థదానే – గుహాద్దేవ మన్యం నజానే నజానే(27)


భావం:- మునులకు గాని లేక భక్తి పరులగు నరులకు గాని వాంఛితముల నొసంగు దేవులంతట గలరు. కాని అంత్యవర్ణ సంజాతులగు మానవులకు గూడ నిజాభీష్టముల నొసంగుటయందు కుమారస్వామి కంటె వేరు దైవమును నేనెరుంగను, నే నెరుంగను.

కలత్రం సుతా బన్దువర్గః పశుర్వా – నరో వా ధ నారీ గృహే యే మదీయాః |

యజన్తో నమన్త: స్తువంతో భవన్త౦ – స్మరన్తశ్చ తే సన్తు సర్వే కుమార!(28)


భావం:-

ఓ కుమారస్వామీ! నా భార్య, బిడ్డలు, బంధువులు, పశువుగాని మా ఇంటియందున్న నా వారందరూ, మగవాడుగాని, ఆడదిగాని, అందరు నిన్ను పూజించువారుగను, నీకు నమస్కరించువారుగను, నిన్ను స్తుతించువారుగను, నిన్ను స్మరించువారుగను నుందురుగాక!


మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టా – స్తథా వ్యాధయో బాధకా యే మదంగే |

భవచ్ఛక్తి తీక్ష్ణాగ్రభిన్నా స్సుదూరే – వినశ్యన్తు తే చూర్ణిత క్రౌఞ్చశైల!(29)


భావం:- క్రౌంచ పర్వతమును చూర్ణము చేసిన కుమారస్వామీ! నా శరీరమును బాధించు మృగములు గాని, పక్షులు గాని, దుష్టములైన అడవి ఈగలు గాని. వ్యాధులు గాని, నీ దగు శక్తియనెడి ఆయుధము యొక్క వాడి అయిన కొనచే భేదింప బడినవై మిక్కిలి దూరముగ నశించుగాక!


జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే నకిం దేవసేనాధినాథ! |

అహం చాతిబాలో భవాన్ లోక తాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ!(30)


భావం:- ఓ దేవ సేనాపతీ! తల్లి గాని, తండ్రి గాని తన బిడ్డా యొక్క అపరాధమును మన్నింపరా ? నేను మిక్కిలి బాలుడను. నీవు లోకములకే తండ్రివి. కావున మహాప్రభూ ! నా సమస్తాపరాధములను క్షమించుము!


నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమ శ్ఛాగ! తుభ్యం నమః కుక్కుటాయ |

నమ స్సిన్ధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కన్ధమూర్తే! నమస్తే నమోస్తు(31)


భావం:- కుమారస్వామీ! నీ వాహన మగు నెమలికి, నీ శక్తి ఆయుధమునకు, నీకు, నీ మేకపోతునకు, నీ ధ్వజమగు కోడిపుంజునకు నమస్కారము. నీవు వసించు సింధు దేశమునకు, సముద్రమునకున్ను నమస్కారము. ఓ స్కందుడా! నీకు మరల మరల నమస్కారము.


జయానన్ధభూమ జయాపారధామ – జయా మోఘకీర్తే! జయానందమూర్తే! |

జయానన్ధసిన్ధో! జయాశేషబన్ధో! – జయ! త్వం సదా ముక్తిదా నేశసూనో(32)


భావం:- ఆనందముతో నిండినవాడా! అపారమైన తేజస్సు గలవాడా! అమోఘమైన కీర్తి కలవాడా! ఆనంద రూపుడా, ఆనంద సముద్రుడా, అందరికీ బంధువైనవాడా! ఎల్లప్పుడు ముక్తినిచ్చు శివకుమారా ! నీకు జయము జయము.


భుజంగాఖ్య వృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తి యుక్తో గుహం సంప్రణమ్య |

స పుత్రా న్కలత్రం ధనం దీర్ఘమాయు – ర్లభేత్స్కన్ధ సాయుజ్య మన్తే నర స్స:(33)


భావం:- ఎవడు భక్తితో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని నమస్కరించి భుజంగవృత్తముతో నున్న యీ స్తవమును పఠించునో ఆ మనుజుడు భార్యను, బిడ్డలను, ధనమును, దీర్ఘాయువును పొంది అంత్య కాలమున స్కంద సాయుజ్యము నొందు గాక !

శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ సంపూర్ణం.


🕉️🌞🌍🌙🌟🚩

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat