లోకంలో అయ్యప్ప బ్రహ్మచారి కదా? అయ్యప్పకి కళ్యాణం చేయడం ఏమిటి? పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర కళ్యాణం వివరణ...🙏🏻

P Madhav Kumar


 ధర్మశాస్త్ర హరిహరుల తనయుడు, శ్రీహరి దేవతలకు అమృతం పంచడానికి మోహిని అవతారం ధరించాడు. శివుడు మోహిని రూపంలో వున్న విష్ణువును చూసి మోహించాడు. ఆ కారణం చేత హరిహరసుతుడు భూమి మీద అవతరించాడు. విష్ణువు మోహని రూపంలో దేవతలకు అమృతాన్ని పంచాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణువుని, శివుడు ఎందుకు మోహించవలసి వచ్చింది అనే సందేహం కలుగుతుంది. ఏ భగవత్ సంకల్పమైనా లోకోద్ధరణ కొరకే సంభవించినది.


లోకంలో అయ్యప్ప బ్రహ్మచారి కదా? అయ్యప్పకి కళ్యాణం చేయడం ఏమిటి?


అవును నిజమే.. అయ్యప్ప బ్రహ్మచారే మహిషి అనే రాక్షసి బ్రహ్మ కొరకు తీవ్ర తపస్సు చేసి హరిహరులకు పుట్టినవాడు, పన్నెండు సంవత్సరాలు భూమి మీద నడియాడిన వాడు నన్ను చంపాలి అని కోరుకుంది.


భూతనాద ఉపాఖ్యానం ప్రకారం అనుసూయ అత్రిల కుమారుడు దత్తాత్రేయుడు. ఆ దత్తుడు గాలవ మహర్షి కూతురైనా లీలావతిని వివాహం చేసుకున్నాడు. దత్తుడు అన్నీ త్యజించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు లీలావతి నిరాకరించింది. అందుకే దత్తుడు లీలావతిని మహిషి అనే రాక్షసిగా పుట్టమని దత్తుడు శపించాడు. ఆ మహిషిని అయ్యప్ప అలుదా నది తీరంలో సంహరించాడు. ఆ మహిషియే మాళికా పురోత్తమ మాతగా అవతరించి అయ్యప్పను వివాహం చేవసుకోవాలని కోరుకుంది. కానీ అయ్యప్ప కలియుగంలో నేను బ్రహ్మచారిణి నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు. శబరిమలలో ఏ ఒక్క కన్నెస్వామి దర్శనం చేసుకోనినాడు నేను నిన్ను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారం ఇప్పటికీ అంబారీ మీద మాళికాపురోత్తమ మాత శరంగుత్తికి వచ్చి చూస్తుంది. కన్నెస్వామి శరంగుత్తిలో శరం గుచ్చితే కన్నెస్వామి వచ్చాడు అని అర్థం. కావున కన్నెస్వామి రాని శబరిమల ఉండదు. మాళికా పురోత్తమకి అయ్యప్పకి వివాహం జరగదు. అయ్యప్ప ముమ్మాటికీ బ్రహ్మచారే.


ఆదియుగంలో అవతరించిన ధర్మశాస్త్రయే కలియుగంలో అయ్యప్పగా మనందరిచేత పూజలందుకుంటున్నాడు. కావున మనం చేసే కళ్యాణం అయ్యప్పది కాదు, ఆదియుగంలోని ధర్మశాస్తది.


ధర్మశాస్త్రాకి ఇద్దరు భార్యలు పూర్ణ పుష్కల. అంటే శాస్త్రని నమ్మి బ్రతికితె జీవితంలో పూర్ణత్వానికి, పుష్కలత్వానికి లోటు వుండదు అని


పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర కళ్యాణంలో పాల్గొనడం వల్ల వివాహం కాని వారికి, సంతానం కాని వారికి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి, భూత, ప్రేత, పిశాచ, రాక్షస బాధలు తొలగిపోవడానికి ఈ కళ్యాణం ఉపకరిస్తుంది. లోకకళ్యాణం కొరకు మాత్రమే ఈ కళ్యాణం చేయబడుతుంది.


కేరళలో పంచ శాస్త్రాలు వున్నాయి.


అచ్చన్ కోవిల్ లో ప్రధాన అర్చకుడు కన్నాస్వామిని కలిసినపుడు వారు చెప్పిన విషయం కేరళలో పంచశాస్త్రలు ఉన్నారు అని వారు నాలుగు ధర్మాలకు బ్రహ్మచర్య గృహస్త ఆశ్రమ వానప్రస్థ సన్యాసాశ్రమాలకు ప్రతీకలు అని చెప్పారు.


1. కుళుతుప్పలై (బాలుడు) 2. అచ్చునకోవిల్ (గృహస్థుడు) 3. అర్యంకావు (వానప్రస్థం)


4. శబరిమల (సన్యాసి) 5. పందలం (స్వామి తిరిగిన ప్రదేశం)


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat