ఆ పంది తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారి మీద బురదపడేలా నడుస్తోంది. ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడవసాగింది. తనను చూసి ప్రక్కకు వెళ్ళడం గమనించిన పంది మరో పందితో ఇలా అంటుంది చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది అని గర్వంగా చెప్పింది...
ఆ మాటలు విన్న మరో ఏనుగు ఈ ఏనుగును ఇలా అడిగింది నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా అని. గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పింది..
"నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జు నుజ్జు అవుతుంది దానికి నేను భయపడటమా..??? నేను ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నా మీద పడితే నేను అశుద్దం అవుతాను "
నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను అని చెప్పింది..
నీతి:- మన బలం ఏంటో
మనకు తెలిస్తే చాలు. ఇతరులు ఎలా మాట్లాడినా పట్టించుకోకూడదు...