మోక్షాన్నిచ్చే తీర్థ క్షేత్రం ‘గయ’

P Madhav Kumar

 

మన దేశంలో అత్యంత పుణ్యప్రదమైన తీర్థ క్షేత్రాలలో

‘గయ’ ఒకటి. ఈ పవిత్ర స్థలంలో కాలు పెడితేనే సమస్త

పాపాలు పటాపంచలై, సద్గతులు కలుగుతాయని

పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య భారతంలో

సుప్రసిద్ధ పుణ్యతీర్థంగా ‘గయ’ పేర్గొంచింది.

వేదాల్లోనూ, పురాణాల్లోనూ ‘గయ’కు విశేషమైన

ప్రాధాన్యం ఉంది. సమస్త దేవతలూ ఈ క్షేత్రాన్ని పరమ

మోక్ష దాయకంగా తీర్థ క్షేత్రంగా భావించారు.


పురాణగాధ


విశాల్పురి మహారాజు విశాల్కి సంతానం లేక

బాధపడుతూ వుంటాడు. ఒకసారి రాజా విశాల్ గయలో

పిండ ప్రదానం చేయడానికి వచ్చాడు. పిండ ప్రదానం

చేశాక అతని పితృదేవతలు సంతృప్తి పొంది,

వైకుంఠానికి వెళ్తూ, విశాల్కి సంతానం కలిగేట్లు

వరం ప్రసాదించారు.


అప్పటినుంచి ఈ తీర్థం

ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. గయ పిండదానం

వంశస్తులు, తమ వంశకర్తల మోక్షంకోసం

ఆచరించే కర్మకాండ. ఆశ్వీయుజ మాసం కృష్ణ

పక్షం మొదటి రోజు నుంచీ అమావాస్య వరకు

మొత్తం పదిహేను రోజులపాటు వాళ్ళు భూలోకాన

ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. దీనినే

పితృపక్షం అంటారు.


గయలోని ‘అక్షయ’ అనే వట వృక్షం ముల్లోకాల్లోనూ

పవిమ్రైనదిగా ఖ్యాతి చెందింది. అక్షయ వృక్షం

సమీపంలో సమర్పించేవన్నీ అక్షయమై శాశ్వతంగా

నిలుస్తాయి. ఎవరైతే ఇక్కడ పల్గూనదిలో స్నానం చేసి

పితృదేవతలకు తర్పణాలిస్తారో వారికి అక్షయ లోకాలు

సిద్ధించడమేకాకుండా, మొత్తం వారి వంశాన్నంతా

ఉద్ధరించిన వారవుతారు.


అలాగే గయలో చేసే

పితృకర్మల్లో ముఖ్యంగా మూడు

పద్ధతులున్నాయి. ఒక్క రోజులోనే శ్రాద్ధకర్మలన్నిటినీ

సంపూర్ణంగా ముగించడం ఒక పద్ధతి.


ఏడు

రోజులపాటు శ్రాద్ధకర్మలు చేయడం రెండో పద్ధతి.


17 రోజులపాటు జరిగేది మూడో పద్ధతి.

శ్రాద్ధ కర్మల్లో పిండ దానమే ప్రధానం. ఎవరి శక్తిమేరకు

వారు ఇక్కడ పిండదానం చేస్తూ వుంటారు.


గయకు కొద్ది దూరంలో ప్రవహిస్తున్న నది పేరు

‘పున్పున్’ పురాణాల్లో దీనిని ‘పునఃపునః’ అని

పేర్కొన్నారు. గయాశ్రాద్ధంలో మొదటి స్నానం ఈ

పున్పున్ నదిలో ఆచరించాలి. అక్కడే పిండ దానం

చెయ్యాలి.


ఆ తర్వాత గయలో శ్రాద్ధానికి ఉపక్రమించాలి. ఒక్క

రోజులోనే శ్రాద్ధ కర్మలన్నీ ముగించుకోదలచినవారు

‘పున్పున్’లో స్నానం చేసి పిండదానం చేసి గయకు

వస్తారు. పల్గూనదిలోని విష్ణుపద్లో అక్షయ వృక్షం

దగ్గర పిండదానం చేస్తారు. దీనకి గయాశ్రాద్ధం

అంటారు.


గయకన్నా ముందు ‘పున్పున్’ నది

వద్ద పిండ దానం చేయాలన్న నిబంధన ఉంది. గయవెళ్ళి

మొదట పల్గూలో స్నానం చేయాలి. ఆ తర్వాత దేవ, పితృ

తర్పణాలు పిమ్మట శ్రాద్ధకర్మల విధి విధానాలను

ఆచరించాలి.


రెండోరోజు ప్రేత్ పర్వతం వద్ద స్నానం

చేసి పిండదానం చేయాలి. పితృదేవతలకు పిండదానం

చేసినపుడు వాటిని తినడానికి రాక్షసులు వస్తారని,

పిండంలోని తిలాలను (నువ్వులు) చూసి వారు

పారిపోతారని భావిస్తారు.


దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు

పాదంమోపిన పరమ పవిత్ర స్థానం విష్ణుపథ్.

గయాసురుని శరీరంపై విష్ణుమూర్తి పాదం మోపిన

భాగమిది. గయలోకెల్లా పవిత్రమైన దేవాలయంగా విష్ణుపద్

మందిరం ఖ్యాతిగాంచింది.


వంద అడుగుల

ఎత్తయిన ఈ మందిరాన్ని 225 సంవత్సరాల క్రితం రాణి

అహల్యాబాయి నిర్మించింది. గర్భగుడిలోని ఒక శిలపై

విష్ణుమూర్తి పదమూడు అంగుళాల పాద

చిహ్నం ఉంది. ఈ పాద చిహ్నాన్ని చందనంతో,

తులసీదళాలతో పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే

ఇతర దేవీ దేవతల మందిరాలు కూడా ఉన్నాయి.


గయ తీర్థ

క్షేత్రాన్ని, ప్రథమ భాగం ‘గయాశిర్’. అంటే గజాసురుని

శిరస్సు. ఇది ఒక కోసు దూరం విస్తరించి ఉందని

చెబుతారు. దీనిని గయాసురుని శరీర క్షేత్రంలో

శిరోభాగంగా భావిస్తారు. ఇక్కడ పిండదానం పరి సమాప్తి

చేస్తారు. ‘గయాశిర్’ వేదిక సమీపంలో అద్భుతమైన

అమ్మవారి విగ్రహాన్ని‘మణ్కృష్టా’దేవిగా పూజిస్తారు.

అలాగే ఈ క్షేత్రంలోనే మాంగళ్యగౌరి అమ్మవారు

కొలువయ్యారు.


సతీదేవికి చెందిన స్థనభాగం పడిన

చోటుగా దీనిని చెబుతారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒకటి.

ఇదిలా ఉంటే 2500 సంవత్సరాల క్రితం గౌతమ

బుద్ధుడు ఇక్కడ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం

చుట్టాడని ప్రతీతి. బుద్ధుని శిష్యులు ఇక్కడే ఓ

‘విహార్’ని ఏర్పాటుచేశారని చెబుతారు. ఆ విహారే

కాలక్రమంలో ‘బీహార్’గా మారి చారిత్రక ప్రాధాన్యాన్ని

సంతరించుకుంది.


అత్యంత పుణ్యప్రదమైన ‘గయ’ క్షేత్రం బీహార్

రాష్ట్రం ‘పాట్నా’ పట్టణానికి 73 కిలోమీటర్లు దూరంలో

ఉంది. గయలో బస చేయడానికి ఎలాంటి వసతి, భోజన

సదుపాయాలు లేవు. అయితే ఆంధ్ర

ప్రాంతంనుంచి వెళ్ళేవారికి గయలో ఓ శ్రాద్ధకర్మల

పండితుడు భోజన వసతి సదుపాయాలు

కల్పిస్తున్నారు. ఒకరికి భోజనానికి 75 రూపాయలు

వసూలుచేస్తారు.


శ్రాద్ధకర్మలు

చేయించుకోదలచినవారు ఆ పండితుడి ద్వారానే

శ్రాద్ధకర్మలు జరిపించుకుంటూ వుంటారు.



Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat