రామానుజుల వారికి భిక్షను ( ప్రసాదం) ఏర్పాటు చేసే #అదృష్టం ఎవరికి లభించిందో తెలుసునా??
శ్రీ రామానుజులవారికి ఆహారం తయారుచేయడానికి
తిరుక్కోటియూర్ నంబివారిచే ఎన్నుకోబడిన
#కిడాంబి_ఆచ్చాన్
భిక్షచేసి జీవించడం సన్యాసుల ధర్మం.రామానుజులవారిపై గిట్టినివారు విషం కలిపిన భిక్షమర్పించారు. ఆ విషయం తెలుసుకున్న రామానుజులు భిక్షకుపోవడం, ఆహారం తినడం మానివేశారు.
మూడురోజులు అయినది, సమాచారం తెలుసుకున్న వారి ఆచార్యులు శ్రీ తిరుక్కోష్టియూర్ నంబి గారు దీనికి పరిష్కారంచేయాలని శ్రీరంగమునకు బయలుదేరారు.
అది మంచి వేసవికాలం. ఆచార్యులవారు ఇసుక నేల మీద పాదుకలతో వస్తున్నారు.
ఆచార్యులవారికి స్వాగతం పలకడానికి రామానుజులు తమ పరివారంతో ఎదురువెళ్ళారు. ఆచార్యుల వారికి
సాష్టాంగనమస్కారం చేశారు. గురువుగారు లెమ్మనలేదు. క్రింద ఇసుక మండుతోంది. అందరి కాళ్ళూ కాలుతున్నాయి.
రామానుజులవారి దేహం కాలుతోందని శిష్యులకు తెలుసు. కానీ ఎదురు మాట్లాడలేని అశక్తత వారిది. అప్పుడు "కిడాంబి ఆచ్చాన్" అనే శిష్యుడు ఇసుక నేలపై తాను పడుకొని శ్రీ రామానుజుల వారి తిరుమేనిని తనపై వేసుకొని ఆయనకు ఎండ వేడిమి కలగకుండా చేసి, ఎదుట నిలిచిన తిరుక్కొట్టియూర్ నంబితో "ఆచార్య! ఇక మీ ఇష్టం.
ఎంతసేపు నిలుచుంటారో నిలుచోండి" అని పలికారు. వెంటనే నంబిగారు "రామానుజా! లే! నీ దేహాన్ని రక్షించే
యోగ్యత ఈ కిడాంబి ఆచ్చాన్కే ఉంది. ఇతని చేతిద్వారా వండబడిన భిక్షా ప్రసాదాన్ని ఇకనుండి నీవు తీసుకోవచ్చు" అని నిర్ణయించి, ఆజ్ఞాపించారు. అంతమంది శ్రీరామానుజుల వారి శిష్యులు ఊరకే చూస్తూ ఉండిపోయారేగాని, తమ ఆచార్యుడు అంతగా ఎండలో వేడిమికి తట్టుకొంటున్నారే, ఆయన్ను ఆ ఎండ తాకిడి నుండి తప్పించాలనే స్ఫూర్తి ఎవరికీ లేకపోయింది, ఒక్క కిడాంబి ఆచ్చాన్ తప్ప!
అప్పటి నుండి శ్రీ రామానుజుల వారి మఠపళ్ళి (వంటశాల)కిడాంబి ఆచ్చాన్ కు అప్పగించడమైంది. ఈ కిడాంబి ఆచ్చాన్ కే #ప్రణతార్తిహరాచార్యులు అని పేరు. వీరు శ్రీశైల అన్పూర్ణులు (శ్రీ తిరుమల నంబి) గారికి మేనల్లుడు. కిడాంబి ఆచ్చాన్ను శ్రీ తిరుమల నంబివారు శ్రీ రామానుజుల వద్దకు శిష్యరికము చేయడానికి పంపించినారు. శ్రీ కిడాంబి ఆచ్చాన్ ను శ్రీరామానుజులు 74 శ్రీ భాష్యసింహాసనాధిపతులలో ఒకరిగా నియమించి, వారిని అనుగ్రహించారు. తదుపరి కిడాంబి ఆచ్చాన్ గారి ముని మనుమడు.ఆయిన కిడాంబి అప్పుళ్ళార్ (ఆత్రేయ రామానుజాచార్యులు) శ్రీ వేదాంత దేశికుల వారికి ఆచార్యులై, శ్రీ రామానుజ దర్శనానికి మహోపకారం చేసారు.
#శ్రీమన్నారాయణ_శరణాగతి_చేద్దాం - #సకల_శుభాలను_పొందుదాం !!!