ఈరోజు చాలా మంది, ఏదో పారాయణ తోనో, పూజలతోనో, నోములతోనో, మరే ఇతర సాధనలతోని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము...
మనము ప్రార్థన అయితే చేస్తున్నాము కానీ, అది ఎలా చేయలో, ఎందుకు చేయాలో తెలుసుకోవడము లేదు.
మనము మన స్వలాభాల కోసం ప్రార్థనలు చేస్తున్నామే తప్ప లోక శ్రేయస్సు కొరకు కొంచెం కూడా చేయడం లేదు!!...
ఇంకా షరతులతో కూడిన ప్రార్థనలు చేస్తున్నాము, కానీ ప్రేమతో, ఆర్తితో చేయడం లేదు.
మనము ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమిటంటే, " ప్రార్థన అంటే భగవంతునితో సంభాషణ చేయడం తప్ప కోరికలు కోరడం కాదు! "...
కష్టమెుచ్చినా, సుఖమెుచ్చినా 'అంతా భగవంతునిదే, ఆయన సంకల్పమే నెరవేరుగాక!'
అని అనుకోవాలి తప్ప నాకు ఇది చేయండి, అది చేయండి అంటూ విలపించడం భక్తి కాదు!!...
" భగవంతుడిని నిబంధనలు లేకుండా శరణాగతి భావంతో భగవంతుని ప్రార్థించాలి"...
అపుడు భగవంతుడు నిత్యమా మన ఇంటా, వెంటే ఉంటూ ప్రహ్లాదుని వలే మనలను సదా రక్షిస్తుంటాడు... ఇది సత్యం...
శిల దేవుడెలా అవుతాడు
శిల కాపాడుతుందా..
ఒక ఆలయంలో హరిదాసు హరికధా కాలక్షేపం చేస్తున్నాడు. ఆ ఊరిలోని నాస్తికడైన
తహసీల్దారు ఒకరు, " హరికధ చెప్తున్న దాసు వద్దకు వెళ్ళి" అయ్యా! ఎక్కడ నుండో ఒక శిలని తెచ్చి , దానికి ఒక రూపం యిచ్చి , మనం ప్రతిష్టించిన శిలని మనమే కాపాడమని" వేడుకుంటూవున్నాము.
ఇది ఎంత మూర్ఖమైన పని. ఆ శిలకి ఎక్కడ నుండి శక్తి వస్తుంది ఆ శిల ఇతరులను ఎలా కాపాడుతుంది అని అడిగాడు.
అది విన్న ఆ హరికధా పౌరాణీకుడు ప్రశాంతంగా, " తమరికి యీ తహశీల్దార్ పని రావడానికి, ముందు ఏం చేస్తూ వుండేవారు అని అడిగాడు.
"ఊరికినే ఖాళీ గా వున్నాను "
" మీరు ఖాళీ గా వున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా గౌరవించారా, మీరు చేసే సంతకానికి ఎదైనా విలువ వుండేదా, లేదు కదా...
అటువంటి సమయంలోనే మీకు తహశీల్దార్ పదవి లభించగానే, తమరు చేసే ప్రతి సంతకానికి ఎంతో విలవ వున్నది. ఈ అధికారం గౌరవం ఎక్కడ నుండి వచ్చాయి, ఆ విధంగానే ఎక్కడ నుండో తెచ్చిన శిల దైవరూపంగా మలచబడి ఆ మూర్తిని ఆగమశాస్త్రాల ప్రకారం ఆలయం లో ప్రతిష్టించి పూజించి నిత్యం మంత్రాలు జపిస్తూంటే విగ్రహానికి దైవశక్తి ఏర్పడుతోంది.
ఆ శక్తే మనలనందర్నీ కాపాడుతున్నది. అని తెలిపాడు, హరికధా పౌరాణికుడు...
దీని అర్ధం ఏమిటంటే చిత్తశుద్ధితో ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రార్థిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు, మనస్పూర్తిగా మనసా వాచా నమ్మితే బండరాయి భగవంతుడవుతాడు అని గ్రహించండి