1. ముఖము నందు 100 రోజులు హాని కలుగును 2.తర్వాత 400 రోజులు కుడి బుజమున ఉండును జయము కలుగును
3.తరువాత 600 రోజులు పాదముల యందు ఉండును త్రిపుట భ్రమ కలుగును
4.తరువాత 500 రోజులు హృదయము నందు ఉండును ధన ప్రాప్తి కలుగును.
5 తరువాత 400 రోజులు ఎడమ బుజము నందు ఉండును దుఃఖం నిచ్చును
6. తరువాత 300 రోజులు శిరస్సు నందు ఉండును లాభములు కలుగును
7.తరువాత 200 రోజులు నేత్రములు యందు ఉండును సుఖం కలుగును.
8. తరువాత 200 రోజులు గుదము నందు దుఃఖమును కలుగ జేయును.
9. ఏలినాటిలోను మొదటి అనగా ఏలినాటి ప్రారంభించిన తేదీ నుండి 100 రోజులు చివరి ఏలినాటి శని వెళ్లిపోవునప్పుడు 200 రోజులు ఎక్కువ కష్ట నష్టములు ఉండును.
జాతకమున చంద్రరాశికి శని 2 6 8 12 స్థానములలో ఉండుట గాని చర రాశి లో ఉండుట గాని పాప గ్రహములతో కలిగి ఉండుట గాని ఆస్తంగాతుడు అగుట గాని వచ్చినచో అటువంటి వారికి ఏలినాటి శని కాలములో ప్రాణధనహానులు రాజకీయ చికాకులు శరీరకష్టములు కలుగును.
శని శుభుడగు చంద్రునితో కలిసి ఉండుటగాని జాతక లగ్నమునకు చంద్రరాశికి గాని కేంద్ర త్రికోన స్థానంలో అనగా 1 4 5 7 9 10 శుభ గ్రహములతో కలిసి ఉండుటగాని శుభ గ్రహ దృష్టి కలిగి ఉండుట గాని సంభవించినచో అటువంటి ఏలినాటి శనికలములో సర్వవిధములా సుఖములను వ్యాపారా అభివృద్ధిని రాజకీయ గౌరవ ఉన్నత పదవి లాభాలను శరీర సౌఖ్యలను ధన లాభ విశేష రాజ యోగలను కలిగించి లక్షాధికారిని చేయును ఇదే విధమైన అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ భాగ్య రాజ్య పంచమస్థాన స్థితి దోషా దోషాలను గమనించేది.