🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸శ్రీ కనకదుర్గమ్మ మహిమలు అనంతం అమోఘం. అమ్మవారికి గాజులు సమర్పించటం అనే ఆచారం ఈ విధంగా వచ్చింది.
🌿పూర్వం సుల్తానుల పరిపాలనా కాలంలో కొంత కాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏవీ జరగకుండా నిలిచిపోయాయి.
🌸వారి ప్రభావం తగ్గిన తరువాత, పండితులంతా ఒకచోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునః ప్రతిష్టిస్తేనే గానీ, అర్చన చేయటానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు.
🌿ఈ విషయం గురించి పెదకళ్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యా పూర్ణదీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతిశాస్త్రి అనే పండితుల్ని విచారించగా...
🌸మహామంత్ర శాస్త్రవేత్తలైన ఆ వెలనాటి వైదిక బ్రాహ్మణులు, ''దుర్గాదేవి స్వయంభువు ఆ తల్లి తిరిగి పునః ప్రతిష్ట చేయాల్సిన అవసరం లేదు. మంత్ర పూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది'' అని చెప్పి
🌿వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణా కార్యక్రమాలు చేసి, కొంతకాలం సకుటుంబంగా ఆ ఆలయంలోనే వుంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారు.
🌸అప్పుడొక ఆశ్చర్య సంఘటన జరిగింది. వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాణ్ణి పిలిచి, తమ చేతులకి గాజులు తొడిగించుకున్నారట.
🌿వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. చివరికి గాజులబ్బాయి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులివ్వమని అడుగగా, ''అదేంటి మా యింట్లో ఉంది నలుగురమే!
🌸మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా? మరి ఐదుగురెక్కడున్నారు'' అని గాజులమ్మే
వానిని ప్రశ్నించారు.
🌿''లేదు నేను ఐదుగురికి గాజులు తొడిగాను. ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపలకెళ్లి దాక్కుని ఉంటుంది? అని ఆ గాజులవాడు రెట్టించాడు.
🌸వారి వాదన విన్న ఆ పండితులు ఐదో అమ్మాయి ఎవరు ఎక్కణ్ణించి వచ్చింది, ఎక్కడకెళ్లింది, అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు.
🌿చివరికి ఆలయంలోకి వెళ్లి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయట. ఆశ్చర్యం! అద్భుతం! ఆ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి, వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేసారు.
🌸అది ఆనోటా ఆనోటా చేరి ఊరంతా ప్రచారమైంది. ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టం అనీ, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.
🌿ఈ గాజుల సంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది.
🌸విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించారు...🚩🌞🌹🙏
🌼సర్వేజనాసుఖీ నోభవంతు 🌼