జనవరి 06 శుక్రవారం ఆరుద్ర దర్శన మహోత్సవం
చాలామంది తెలిసి తెలియక పాపాలు చేస్తుంటారు. ఆ పాపాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. ఆ పాపాల వలన కలిగే అనర్థాలను, కష్ట, నష్టాలు ఏదో ఒక సమయంలో అనుభవించవలసి వస్తూంది. అలాంటి పాపాలనుంచి విముక్తి పొందడానికి ఆరోత్సవం మంచి అవకాశం. శివ నామస్మరణం, శివ దర్శనం వలన పాపాలు నశిస్తాయి. ముఖ్యంగా స్వామివారి 'ఆరుద్ర' నక్షత్రం రోజున స్వామివారి ఆరాధన అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పుష్యమాసంలో వచ్చే 'ఆరుద్ర' నక్షత్రం రోజున శైవ క్షేత్రాలలో 'ఆర్థోత్సవం' నిర్వహిస్తారు. ఆ రోజున ఆయా శైవాలయాలలో విశేషంగా నిర్వహించే 'ఆర్థోత్సవం'లో పాల్గొనడానికి భక్తులు
పెద్ద సంఖ్యలో శైవాలయాలకు చేరుకుంటారు. ఆర్థ్రోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడం వలన పాపాలు దూరమవుతాయని పురాణ వచనం. ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టి ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుడిని. బిల్వదళాలతో పూజించాలి. స్వామివారి ఆలయంలో దీపాలను వెలిగించాలి. ఈ విధంగా స్వామివారి జన్మ నక్షత్రం రోజున ఆయనను అంకితభావంతో ఆరాధించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా అన్ని శివాలయాల్లో ఆరుద్ర దర్శన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.