పూజ ప్రారంభమునకు ముందు పాటించవలసిన కనీస నియమాలు తెలపండి ?

P Madhav Kumar
ధర్మసందేహాలు:

మగవారి విషయంలో నిత్యం తలస్నానంచేసి పూజకు ఉపక్రమించాలి అనే నియమం వుంది. ఆడవారు కేవలం శుక్రవారం తలంటుపోసుకోవాలి. మిగిలిన రోజులలో పసుపునీళ్ళు నెత్తినచల్లుకోవాలి. 

పూజకు ప్రత్యేక వస్త్రం ప్రతిరోజూ ఉతికి ఆరవేసుకోవాలి. పూజకు ఉపక్రమించినది మొదలు పూజ అయ్యేవరకు మనకు కావలసిన సామాగ్రి ప్రక్కనే వుంచుకోవాలి. 

పూజ మధ్యలో లేవకూడదు. మరియు యితర విషయాల గురించి చర్చించకూడదు. 

దీపారాధన, నివేదన, భక్తిలేని పూజలు వ్యర్థం. 

ఆసనం వేసుకొని కూర్చోవాలి. మనకంటే వున్నత ఆసనం మీద దేవుడు వుండాలి. 

పూజా సమయంలో యితరులకు నమస్కరించరాదు. మగవారు శైవులు విభూతి, వైష్ణవులు నామం పెట్టుకోకుండా పూజచేయరాదు. ఆడవారు నుదుట కుంకుమ, కాళ్ళకు పసుపు లేకుండా పూజచేయరాదు. కావున పసుపు కుంకుమ ధారణ స్త్రీలకు తప్పనిసరి. 

పూజా సమయంలో ఆడవారు బొట్టుబిళ్లలు ధరించుట శ్రేయస్కరం కాదు. 

పూజచేసిన తరువాత ఆసనం తీయకపోయినా, నిద్ర నుండి లేవగానే పక్కబట్టలు తీయకపోయినా దరిద్రం వస్తుంది. అని 
పెద్దలు చెబుతారు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat